HCU Students, Professors Accorded Grand Welcome After Release

Hcu students and professors released

Cherlapally jail, Hyderabad Central University, HCU students, hcu professors, Vice chancellor Appa Rao, justice varudhini, Miyapur court, Professor Ratnam, Appa Rao, grand welcome to hcu students, rohith vemula, kanhaiah kumar, jnu, radhika

Dozens of students and research scholars gathered at Cherlapally jail to extend a grand welcome to their campus mates who were released on bail on Tuesday.

జైలు నుంచి విడుదలైన విద్యార్ధులకు హెచ్.సి.యూలో ఘనస్వాగతం

Posted: 03/30/2016 09:26 AM IST
Hcu students and professors released

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శటీలో వైస్ ఛాన్సిలర్ అప్పారావు మరోమారు వీసీగా బాధ్యలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ రెండు స్టూడెంట్ యూనియన్ల మధ్య జరిగిన తోపులాటలో కేవలం వీసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్న అభియోగాలపై ఒక వర్గానికి చెందిన విద్యార్థులను వారికి మద్దతు తెలిపిన ఫ్రోఫెసర్లపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో అరెస్టై చర్లపల్లి జైలుకెళ్లిన హెచ్‌సీయూ విద్యార్థులు మంగళవారం రాత్రి 9 గంటలకు బెయిలుపై విడుదలయ్యారు.

వీరిలో విద్యార్థి సంఘం నేతలతో పాటు ప్రొఫెసర్లు రత్నం, తథాగత్, ఏఎస్‌ఏ అధ్యక్షుడు ప్రశాంత్, జేఏసీ నాయకుడు వెంకటేశ్‌చౌహాన్, లింగస్వామి, అచ్యుతరావు, హరీష్‌లతో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మియాపూర్ కోర్టు న్యాయమూర్తి వరూధిని బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. వీరి విడుదల కోసం ఉదయం నుంచి జైలు బయట విద్యార్థులు, ప్రొఫెసర్ల నిరీక్షించారు. విద్యార్థులు, ప్రోఫెసర్ల విడుదలకు చాల సమయం పట్టడంతో మొత్తానికి రాత్రి వారిని విడుదల చేశారు.

విడులైన అనంతరం జీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి ప్రదర్శనగా హెచ్‌సీయూకు వెళ్లారు. చర్లపల్లి జైలు నుంచి విద్యార్థులు వస్తుండడంతో వారందరికీ హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు కాగడాలు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఏ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ... చెరసాలలు, ఉరికొయ్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు.  ప్రొఫెసర్ రత్నం మాట్లాడుతూ... వీసీ అప్పారావును తొలగించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU students  Miyapur court  Professor Ratnam  Appa Rao  

Other Articles