Start selling Sahara group properties

Start selling sahara group properties

Sharaha, Sahara Group, Subratho Roy, Sahara Group case, Supreme Court

The Supreme Court Tuesday asked the Sebi to start selling properties of Sahara conglomerate for generating bail money required for Subrata Roy’s release. Recording Sahara group’s inability to sell its properties, the court said the market regulator should devise a suitable mechanism for sale of the properties so that Rs 10,000 crore is finally deposited with the Sebi as a pre-condition set by the apex court to secure release of Roy and two other directors who are imprisoned since March 2014.

సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం ఓకే

Posted: 03/30/2016 08:41 AM IST
Start selling sahara group properties

సహారా గ్రూప్ కు చెందిన ఆస్తులను అమ్మేందుకు అత్యన్నుత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అమ్మకానికి ఎలాంటి చిక్కులు లేని ఆస్తులను ఎంచుకోవాలని సూచించింది. సహారా ఆస్తులకు చెందిన 86 టైటిల్ డీడ్‌ లు ఇప్పటికే సెబీ వద్ద ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవే, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం సహారా కేసును విచారిస్తున్నది. సహారా ఆస్తులను రిజర్వ్ ధరలో 90 శాతానికంటే తక్కువకు విక్రయించవద్దని కోర్టుబెంచ్ సెబీని ఆదేశించింది. ఒకవేళ కనీస ధరలో 90 శాతానికంటే తక్కువకు బిడ్లు దాఖలైన పక్షంలో ఆ ఆస్తిని విక్రయించేముందు కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది.

సహారా డిపాజిటర్లకు సొమ్ము తిరిగిచ్చే విషయం ఏమాత్రం ముందుకు కదలడం లేదని సెబీ తరపు కౌన్సిల్ తెలుపడంతో కోర్టు ఆస్తుల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు సొమ్ము తిరిగిచ్చే కేసుకు సంబంధించి సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతారాయ్ మార్చి 4, 2014 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రెండేండ్లకు పైగా తీహార్ జైల్లో మగ్గుతున్న రాయ్‌కి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విధించిన షరతులకు అనుగుణంగా సహారా గ్రూపు నిధులు సేకరించలేక సతమతమవుతున్నది. రాయ్‌కి బెయిల్ మంజూరు చేయాలంటే రూ.5 వేల కోట్ల నగదు, అంతేమొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని, ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.36 వేల కోట్లను పూర్తిగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను విక్రయించే విషయంలో తీవ్ర ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తున్నదని రాయ్ తరపున న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయస్థానానికి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharaha  Sahara Group  Subratho Roy  Sahara Group case  Supreme Court  

Other Articles