KCR said that they will fill one lakh vaccancies

Kcr said that they will fill one lakh vaccancies

KCR, TRS, Jobs, One Lakh Jobs, Telangana, Assembly

KCR said that they will fill one lakh vaccancies. he said that they will fill all vaccancies.

లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం;కేసీఆర్

Posted: 03/30/2016 08:33 AM IST
Kcr said that they will fill one lakh vaccancies

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు కచ్చితంగా ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే సింగరేణి ఉద్యోగాలు కలుపుకొని 24,500 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇవిగాక 10 వేల ఉపాధ్యాయ పోస్టులు, మరో వెయ్యి ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గవర్నమెంటు ఉద్యోగమే వస్తుందని చెప్పి భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అసెంబ్లీలో ఆయన వెల్లడించారు.

అయితే.. ఇంటికో ఉద్యోగం వస్తుందన్న మాట భ్రాంతేనన్నారు సీఎం. ఇంటికో ఉద్యోగం అనేది ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం అనే హామీని తామెప్పుడూ ఇవ్వలేదని, ఇటువంటి హామీని తెలంగాణ రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని అన్నారు.నిధులు మన రాష్ట్రంలోనే ఖర్చు కావాలన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరిందన్నారు సీఎం కేసీఆర్. ఇక, గతంలో ఎన్నోమార్లు చెప్పినట్లుగానే లక్ష ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామన్నారు. అయితే..ఇంకా కొన్ని శాఖల్లో ఉద్యోగుల పంపకాన్ని కమలనాథన్ కమిటీ పూర్తి చేయలేదన్నారు. అవి కొలిక్కి వస్తే తప్ప చాలా విషయాలు తేలని పరిస్థితి నెలకొందన్నారు ముఖ్యమంత్రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TRS  Jobs  One Lakh Jobs  Telangana  Assembly  

Other Articles