Crocin, Dolo, D-cold ban not good for healt

Crocin dolo d cold ban not good for healt

Vicks500, Crocin, Dolo, d-cold, fixed-dose combination drugs

Physicians in the city criticised the central government for banning some 300 fixed-dose combination drugs, including cough syrup with Dr Shobha Rani R. Hiremath, Professor of Pharmacy Practice, Al-Ameen College of Pharmacy saying “Before banning these medicines, the health ministry should have conducted some survey or study.”

క్రోసీన్, డీకోల్డ్ టోటల్, విక్స్500లపై నిషేదం

Posted: 03/17/2016 07:41 AM IST
Crocin dolo d cold ban not good for healt

జ్వరంగా అనిపిస్తోందా... జలుబు ఉందా... దగ్గు మిమ్మల్ని వేధిస్తుందా అయితే మందుల షాపుకు వెల్లి క్రోసిన్, డీకోల్డ్ టోటల్, ఫ్లూ, ఓఫ్లాక్స్, విక్స్ 500, కోరెక్స్ లాంటి మందులు తీసుకు వాడుతున్నారా. అయితే జాగ్రత్త వాటిని కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. వీటిని దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే ప్రజల ఆరోగ్యంపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాచని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మాయదారి రోగాలకు కారణమవుతున్న 350 రకాల మాత్రలపై నిషేధం విధిస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నాసివియాన్, సుమో, గ్యాస్ట్రోజైల్, చెరికాఫ్, నిములిడ్, కాఫ్‌నిల్, డోలో, డెకాఫ్, ఓ2, పిల్లలకు ఉపయోగించే టానిక్ టీ-28, డెడీకాఫ్ లాంటి ఔషధాలు ఉన్నాయి.

మెడికల్ ఫార్ములా ప్రకారం ఈ రకమైన ఔషధాలను ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ గా వ్యవహరిస్తారు. ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్స్ అంటే.. మెడికల్ ఫార్ములా ప్రకారం స్థిరమైన నిష్పత్తిలో రెండు, లేదా అంతకంటే డ్రగ్స్ (ఔషధాలు) కలిపి సింగిల్ డోస్ డ్రగ్‌గా తయారు చేయ డం. ప్రభుత్వ నిర్ణయంతో యాంటీ డయాబెటిక్, శ్వాస సంబంధిత (రెస్పిరేటరీ), నొప్పి నివారణ (అనాల్జిసిక్స్), సంక్రమణ నిరోధక (యాంటీ ఇన్‌ఫెక్షన్), జీర్ణాశయాంతర (గ్యాస్ట్రో-ఇంటెస్టినల్) వ్యాధులకు సంబంధించిన చికిత్స విధానంపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఫార్మాసూటికల్ పరిశోధనా సంస్థ ఏఐఓసీడీ ఏడబ్ల్యూఏసీఎస్ పేర్కొన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vicks500  Crocin  Dolo  d-cold  fixed-dose combination drugs  

Other Articles