Chris Gayle century sees West Indies beat England at World Twenty20

Chris gayle century sees west indies beat england at world twenty20

chris Gayle, England, WestIndies, T20 Wrold Cup, Gayle

Chris Gayle's brutal unbeaten century sent England to a chastening six-wicket defeat by West Indies in their opening match of the World Twenty20 in Mumbai. Gayle struck 11 sixes in his 47-ball hundred, the joint-third fastest in T20 internationals and became the first man to score two tons in the World T20.

గేల్ సునామీలో కొట్టుకుపోయిన ఇంగ్లండ్

Posted: 03/17/2016 07:30 AM IST
Chris gayle century sees west indies beat england at world twenty20

టి20 వరల్డ్ కప్ లో అసలు మజా మొదలైంది. బ్యాటింగ్ లో విధ్వంసం అంటే ఏంటో... ప్రత్యర్థి జట్టుకు చుక్కలు అంటే ఏంటో చూపించే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఎవరు కూడా క్రిస్ గేల్ కు సమానం కాదు. నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఉతికేసి ఇంగ్లండ్ టీంకు తన విశ్వరూపాన్ని చూపించాడు. తను బ్యాటింగ్ కు వచ్చిన మూడో బాల్ నుండే పరుగుల సునామీని మొదలు పెట్టాడు.దాంతో టీ20ల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ గేల్ పేరిట రికార్డైంది. తన ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు, 5 ఫోర్లతో చెలరేగిన గేల్..208.33 స్ట్రైక్‌రేట్‌తో టీ20ల్లో అత్యధిక సిక్స్‌ల రికార్డు(98)ను మరింత పదిలం చేసుకున్నాడు

క్రిస్ తర్వాత కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్(91) ఉన్నాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్న గేల్..ఫించ్‌తో కలిసి మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకు ముందు సౌతాఫ్రికాపై 2007 తొలి పొట్టి ప్రపంచకప్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాపై 50 బంతుల్లో గేల్ సెంచరీ కొట్టాడు. దీంతో ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన మెకల్లమ్ రికార్డును కూడా గేల్ సమం చేశాడు. ఇలా తన అద్భుత ఇన్నింగ్స్‌తో సహచర బ్యాట్స్‌మెన్‌తో కలిసి గేల్ భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు ఒంటిచేత్తో చిరస్మరణీయ విజయాన్నందించాడు. సెంచరీ చేరుకున్న తర్వాత తనదైన స్టైల్లో చేతులు చాచుతూ డగ్‌ఔట్‌లోని సహచర ఆటగాళ్లతో గేల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆద్యంతం అలరించిన గేల్ ఇన్నింగ్స్‌ను ముంబై ప్రేక్షకులు తనివీతీరా ఆస్వాదించారు.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్(15), అలెక్స్ హేల్స్(28) జట్టుకు శుభారంభాన్నందించారు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. ముఖ్యంగా జేరోమ్ టేలర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రాయ్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఐదు వైడ్లు ఉండటం విశేషం. అయితే రాయ్ జోరుకు రస్సెల్ వేసిన ఐదో ఓవర్లో బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన జో రూట్(36 బంతుల్లో 48) హేల్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. రూట్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. వీరిద్దరు 22 పరుగుల తేడాతో నిష్క్రమించడం ఇంగ్లండ్‌ను ఒక రకంగా దెబ్బతీసింది. అయినా ఇంగ్లండ్ పరుగుల దూకుడు తగ్గలేదు. తర్వాత వచ్చిన జోస్ బట్లర్(30), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(27 నాటౌట్) కొనసాగించారు. ఇలా విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు సాధ్యపడింది. విండీస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris Gayle  England  WestIndies  T20 Wrold Cup  Gayle  

Other Articles