Petrol prices hiked by Rs 3.07 per litre, diesel by Rs 1.90

Petrol prices hiked by rs 3 07 per litre diesel by rs 1 90

petrol, Diesel, India, Indian Oil Corporation, Petrol Prices hiked

Oil marketing companies on Wednesday increased the prices of petrol by Rs 3.07 per litre while it hiked the prices of diesel by Rs 1.90. The new prices , which includes state levies, will come into effective midnight tonight of March 16-17. After this hike, a litre of petrol will cost Rs 59.68/litre in Delhi; Rs 63.76 in Kolkata; Rs 65.79 in Mumbai, and Rs 59.13 in Chennai, said Indian Oil Corporation.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Posted: 03/17/2016 07:53 AM IST
Petrol prices hiked by rs 3 07 per litre diesel by rs 1 90

పెట్రోల్ ధరలు తగ్గాయని కాస్త సంతోషంగా ఉన్న వాహనదారులకు ఓ చేదు వార్త. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధర అమాంతం పెరిగిపోవడం వాహనదారులను కలవరపెడుతోంది. పెట్రోల్ ధరను 3రూపాయల7పైసలు పెంచినట్లు దేశంలో ఇంధన విక్రయంలో అతిపెద్ద సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రకటించింది. అలాగే డీజిల్ ధరను లీటర్‌కు రూ.1.90 పెంచింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.56.61 నుంచి రూ.59.68కి చేరుకోనుండగా, డీజిల్ ధర రూ.46.43 నుంచి రూ.48.33కి చేరుకోనున్నది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

ఆయా నగరాల్లో విధించే వ్యాట్, ఇతర పన్నుల ఆధారంగా ధరలు మరింత ప్రియంకానున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.3.27 పెరిగి రూ.60.63 నుంచి రూ.63.90కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.2.05 పెరిగి రూ.52.07గా నమోదైంది. ధరలు పెరుగకముందు డీజిల్ రూ. 50.02గా ఉంది. జనవరి నుంచి తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా, డీజిల్ ధరలు మూడోసారి పెరిగాయి. ఈ నెల 1న లీటర్ పెట్రోల్‌పై రూ.3.02 తగ్గించిన ఇంధన సంస్థలు డీజిల్‌పై మాత్రం రూ.1.47 పెంచాయి. ఫిబ్రవరి 16న డీజిల్ ధరను రూ.3.65 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పదేండ్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నప్పటికీ నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఐదుసార్లు పెంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  India  Indian Oil Corporation  Petrol Prices hiked  

Other Articles