Sting shows Mamata Banerjee’s top leaders ‘taking cash to help fictitious firm’

Mamata banerjee dares opposition parties to fight tmc politically

Trinamool Congress, West Bengal, Assembly Elections 2016, Mamata Banerjee, Sting operation on TMC, TMC minister fraud, TMC mps fraud, TMC fraud, tmc leaders in string operation,

Sting Operations from Narada News reveals how Mamata Banerjee's TMC leaders were caught on camera accepting cash, agreeing to flout all the rules to favor a fictitious company.

ITEMVIDEOS: ఎన్నికల వేళ.. అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన అధికారసభ్యులు

Posted: 03/15/2016 09:57 AM IST
Mamata banerjee dares opposition parties to fight tmc politically

ఎన్నికల వేళ అధికార పక్షం అడ్డంగా దోరికిపోయింది. మరోమారు పశ్చిమ బెంగాల్ అధికార పగ్గాలను అందుకోవాలని.. బెంగాల్ ప్రజలు తమవైపునే వున్నారని, ధీమా వ్యక్తం చేస్తున్న తృణముల్ కాంగ్రెస్ కు ఓ టీవీ ఛానెల్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కమీషన్ షెడ్యూలు విడుదల చేయగానే తమ ధీమాతో అధినేత్రి మమత అభ్యర్థుల పేర్లను కూడా ఖారారు చేసింది. దీని బట్టి మళ్లీ పగ్గాలు అందుకుంటేమనే అంచెంలమైన విశ్వాసం అమెలో వుందని స్పష్టమవుతుంది.

తృణముల్ కాంగ్రెస్ కు అధికార పగ్గాలను అందించిన వామపక్ష పార్టీ మాదిరిగానే తాను కూడా పశ్చిమ బెంగాల్ ను రెండున్నర మూడు దశాబ్ధాలు ఎలానని భావించారు మమత బెనర్జీ. అలాంటి ధీమాకు బీటాలు వారేలా చేసింది అవినీతికి పాల్పడడిన.. ఎంపీలు, మంత్రులు, మేయర్ సహా పలువురు నేతలు స్టింగ్ అపరేషన్లో అడ్డంగా దోరికిపోయాయి. మరో పక్షం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ మమత బెనర్జీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్టు చెప్తున్న ఓ వీడియో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో హల్‌చల్ చేస్తోంది. మీడియా ఈ స్టింగ్ ఆపరేషన్ గురించే కథనాలు ప్రసారం చేస్తుండటంతో ఇప్పటికే అధికార పక్షంపై ప్రతిపక్షం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగత్ రాయ్, సుల్తాన్ అహ్మద్, బెంగాల్ మంత్రి సుబ్రత ముఖర్జీ, కోల్‌కతా మేయర్ శోవన్ ఛటర్జీ తదితరులు ఓ కల్పితమైన లాబీకి పలు హామీలు ఇస్తూ.. లంచాలు తీసుకుంటూ ఈ వీడియోలో కనిపించారు.

నారదన్యూస్‌.కామ్‌ రెండేళ్ల వ్యవధిలో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే ఈ వీడియోలో సీఎం మమతాబెనర్జీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వీడియో ప్రామాణికతపై ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌ రాజకీయాలను ఈ స్టింగ్ ఆపరేషన్‌  ఓ కుదుపు కుదిపింది. ఏప్రిల్ 4 నుంచి ఆరు దఫాలుగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-వామపక్షాల కూటమి, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీకి కాసింత ఎదురుగాలి వీచే అవకాశాలు లేకపోలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sting operation  investigation  TMC  mamta banarjee  

Other Articles