hero vishal to join politics by joining bjp

Will hero vishal join the bjp

vishal, bjp, p muralidhar rao, tamil nadu elections, krishnamachary srikanth, rajnikanth, pm modi, amith shah, nadiyar sangam, Bharatiya Janata Party, Assembly elections, Kollywood

BJP seems to be trying now to rope in 'Crazy Hero' Vishal. His do-gooder roles on screen and recent service activities during the Chennai floods have endeared him to the people of Tamil Nadu.

రజనీ తరువాత.. హీరో విశాల్ కు బీజేపి ఎర..?

Posted: 03/15/2016 11:46 AM IST
Will hero vishal join the bjp

తమిళనాడుతో తమ పార్టీకి స్టార్ స్టేటస్ తీసుకురావాలని యత్నించిన బీజేపి శ్రేణులు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను తమ పార్టీలోకి చేర్పించుకునేందుకు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగినా.. తనకు రాజకీయాలు వద్దని సున్నితంగా  తిరస్కరించిన తరువాత బీజేపి పార్టీ మరో తార కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీస్టార్‌గా వెలుగొందుతున్న విశాల్‌ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నై వాసుడైన క్రికెటర్ శ్రీకాంత్ విశాల్ కోసం గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.

బీజేపి పార్టీ అగ్రనేత మురళీధరరావుతో శ్రీకాంత్ సంప్రదింపులు జరిపారు. మైలాపూరు నియోజకవర్గం నుంచి విశాల్‌ను పోటీకి పెట్టాలని శ్రీకాంత్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీకి సీనియర్ నటీనటులు విసు, నటి వైజయంతీమాల తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే విశాల్‌ను సైతం ఎన్నికల బరిలో దించాలని బీజేపీ సైతం భావిస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణంలో తలమునకలై ఉన్నందున మరో ఆరునెలలు విరామం లేదని విశాల్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం విశాల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
 
జార్జికోటపై జెండా పాతేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కదలివస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో తమిళనాడుకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీ కూటమి కోసం రాష్ట్ర నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో తమతో కలిసి నడిచారన్న నమ్మకంతో డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలను అనేకసార్లు ఆహ్వానించారు. అలాగే మరోవైపు అన్నాడీఎంకే నుంచి అమ్మ పిలుపు కోసం ఆశగా ఎదురుచూశారు.  ఆఖరుకు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ సైతం రంగంలోకి దిగారు.

అయితే  ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పొత్తు చర్చలతో నిమిత్తం లేకుండా బీజేపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను నిలపాలని అధిష్టానం ఆదేశించింది. ఎవ్వరూ ఊహించని రీతిలో 234 నియోజకవర్గాలకు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒంటరిపోరా లేక మరేదైనా పార్టీలు ముందుకు వస్తాయా అని బీజేపీ సందిగ్ధంలో ఉంది. పార్టీలోని ఎక్కువ శాతం మంది ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ బలమేంటో తేటతెల్లం కాగలదని పార్టీశ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishal  bjp  p muralidhar rao  tamil nadu elections  krishnamachary srikanth  

Other Articles