Hyderabad teen and pals threaten, attack police in station

Hyderabad teen and pals threaten attack police in station

Police, KPHB, Priya Singh, Drunk Girl in Police station

A 19-year-old girl from Kolkata and her drunk friends were booked for vandalising the KPHB police station and attacking police personnel. Four persons, including a software engineer, who were brought to the police station after they allegedly created nuisance at Hydernagar, ran amok in the police station on Saturday night.

ITEMVIDEOS: తాగి పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన యువతి

Posted: 03/15/2016 11:17 AM IST
Hyderabad teen and pals threaten attack police in station

మందు తాగితే మగవాళ్లైనా, మగువలైనా ఆగలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కెపీహెచ్బి పోలీస్ స్టేషన్లో ఓ యువతి హల్ చల్ చేసింది. ముగ్గురు మందుబాబులు, వారికి తోడు ఓ యువతి ఓ ఇంట్లో పూటుగా మందుకొట్టారు. కానీ న్యూసెన్స్ చేయడంతో పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. అయితే పూర్తి నిషాలో ఉండటంతో ఆ యువతి నానాహంగామా చేసింది. పోలీస్ స్టేషన్ లో కొంతసేపు సీన్ తారుమారు చేసింది. బూతులు తిట్టడం, చేయి చేసుకోవడం జరిగింది

ఈ నెల 12 అర్ధరాత్రి వరకు హైదర్ నగర్ లోని ఓ ఇంట్లో స్నేహితులైన కౌశిక్, శివ, తరుణ్, ప్రియాసింగ్ తో కలసి పీకలదాకా తాగారు. అయితే అర్ధరాత్రి 11.30 గంటలకు ఖాళీ బాటిళ్లను బిల్డింగ్ బయటకు విసిరేశారు. ఆ బాటిల్ కాస్తా రేకుల షెడ్డుపై పడింది. ఆ రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న వ్యక్తి డయల్ 100 కి ఫోన్ చేయడంతో కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని మందలించే యత్నం చేశారు. కానీ మందుబాబులు దారికొచ్చేలా లేకపోవడంతో ఈ నలుగురిని ఠాణాకు తీసుకెళ్లారు. అసలే మద్యం మత్తులో ఉన్నారు. ఖాకీలు నిలదీసేసరికి అహంతో కోపం నషాళానికంటింది. పరువు పోతుందన్న ఫ్రష్టేషన్ లో యువతి ప్రియాసింగ్ అయితే ఠాణాలో బీభత్సం చేసింది. 


తాగుబోతులు కాల మీద కాలు వేసుకోవడమే కాదు కానిస్టేబుల్ పై నోరు పారేసుకున్నారు. చేతులకూ పనిచెప్పారు.  నిందితుల్లో శివ స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ కాగా, తరుణ్ ఈవెంట్ ఆర్గనైజర్, కౌశిక్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇక ప్రియాసింగ్ ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థిని. న్యూసెన్స్ చేయడమే కాకుండా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయినా గుట్టుచప్పుడు కాకుండా తాగి.. మూడో కన్ను చూడకన్నా ముందే పడుకోకుండా ఇలా నానాహంగామా చేసిన వార్తల్లో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  KPHB  Priya Singh  Drunk Girl in Police station  

Other Articles