major Accident near to Gollapudi

Major accident near to gollapudi

Vijayawada, Gollapudi, Accident, Dhanunjaya Travels, Medicos, Osmania Medical College

Viajayawada Gollapudi near a private travel bus met with accident. in this accident four medicos and bus driver died.

గొల్లపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురు మెడికోల మృతి

Posted: 03/15/2016 10:53 AM IST
Major accident near to gollapudi

విజయవాడ గొల్లపూడి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు మెడికో విద్యార్ధులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఉస్మానియా మెడికల్‌ కాలేజి విద్యార్ధులు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు అమలాపురంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొని.. తిరిగి హైదరాబాద్‌ వస్తున్నారు. వీరంతా ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో నగరానికి బయలుదేరారు. కానీ గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద చెట్టుకు బస్సును ఢీకొంది. అక్కడికక్కడనే నలుగురు మెడికోలు, డ్రైవర్ దుర్మరణం చెందారు. డ్రైవర్‌ మద్యం మత్తులో అతివేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది వైద్య విద్యార్ధులున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్ బస్సును నడిపాడని పోలీసులు పేర్కొన్నారు. కంట్రోల్ కాకపోవడంతో చెట్టుకు ఢీకొట్టాడని తెలిపారు. అమలాపురంలో క్రీడల్లో పాల్గొనేందుకు వీరంతా ఇక్కడకు రావడం జరిగిందన్నారు. కాగా బస్సులో చోరీ జరిగిందని ప్రమాదం అనంతరం విద్యార్థులు తెలిపారు. సెల్ ఫోన్స్ , నగదు చోరీ కావడంతో తాము ప్రశ్నించడం జరిగిందని అప్పటికే క్లీనర్ పరారీ అయ్యాడని పేర్కొన్నారు. ఇతని కోసం వెతికి పట్టుకున్నామని, అనంతరం బస్సు వెనక కూర్చొబెట్టామన్నారు. అనంతరం ఈ విషయంపై డ్రైవర్ ను ప్రశ్నించడం జరిగిందని, కానీ డ్రైవర్ ర్యాష్ గా బస్సును నడిపించాడని తెలిపారు. కావాలనే ఇదంతా చేశాడని పేర్కొన్నారు. డ్రైవర్, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ర్యాష్ గా నడపడంతో బస్సు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Gollapudi  Accident  Dhanunjaya Travels  Medicos  Osmania Medical College  

Other Articles