Loathed By Indian And Loved By Pakistan

Loathed by indian and loved by pakistan

JNU, pakistan, JNU Row, kanaiah Kumar, Pakistan, pakistan Media, Kashmir

Kanhaiya Kumar who is called a traitor by the country has been appreciated by Pakistan. Pakistan Media focuesd on Delhi JNU Incidents.

ITEMVIDEOS: పాకిస్థాన్ మీడియాలో హీరోగా కన్హయ కుమార్

Posted: 03/12/2016 01:24 PM IST
Loathed by indian and loved by pakistan

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశద్రోహ కేసు నిందితుడు, జె.ఎన్.యు విద్యార్ధి సంఘ నాయుకుడు కన్హయ్య కుమార్ ను పాక్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరితీయపడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురు వర్ధంతిని ఢిల్లీ జెఎన్‌యూలో నిర్వహించి భారతదేశాన్ని ముక్కలు చేస్తాం, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న కన్హయ్య కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ మీడియా అత్యుత్సాహం చూపిస్తోంది. కన్హయ్య కుమార్ ను హీరో అభివర్ణిస్తూ బ్రహ్మరథం పడుతోంది.

కాశ్మీర్ మీద గత కొంత కాలంగా పాకిస్థాన్ తనదే ఆధిపత్యం చేయాలనుకున్నాకానీ భారత్ దాన్ని అడ్డుకుంటోంది. కానీ పాకిస్థాన్ కు ఇప్పుడు మాత్రం ఇక్కడ దిల్లీ జెఎన్.యు విద్యార్థులు, లెక్చరర్లు చేసిన స్పీచులను ప్రధానంగా పదేపదే ప్రసారం చేస్తోంది. తిరిగి మరోసారి కాశ్మీర్ పాకిస్థాన్ దే అనే బావన అక్కడి వారిలో, అంతర్జాతీయ సమాజంలో నిరూపించేందుకు, వాదించేందుకు ముందుకు వస్తోంది. ఇక పాకిస్థాన్ వెనకేసుకొస్తున్న అప్ఘల్ గురును సమర్థిస్తు జెఎన్.యు విద్యార్థులు చేసిన నినాదాలను కూడా ప్రసారం చేసింది పాక్ మీడియా. భారతీయ సైనికులు జమ్ముకాశ్మీర్‌లో స్త్రీలపై అత్యాచారాలు చేస్తోందన్న కన్నయ్య వ్యాఖ్యల్ని, జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదన్న ఢిల్లీ జెఎన్‌యూ ప్రొఫెసర్ నివేదిత వ్యాఖ్యలను కూడా పాక్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU  pakistan  JNU Row  kanaiah Kumar  Pakistan  pakistan Media  Kashmir  

Other Articles