Anupama Chopra Interview with Pawan Kalyan

Anupama chopra interview with pawan kalyan

Pawan Kalyan, Pawan Kalyan Interview, Anupama Chopra, Power Star Pawan Kalyan, Sardar Interview, janasena, Janasena Party

Popular Journalist and Film Critic Anupama Chopra is going to take an Interview with Pawan Kalyan today and watch here exclusively. Pawan Kalyan gives interviews very rare but here a popular journalist named Anupama Chopra is going to interview Power star. Yes, it is true; actually, Pawan is dubbed as a media-shy public figure because of a reason. He gave only two interviews throughout his film career from two decades long.

ITEMVIDEOS: పవన్ కళ్యాణ్ తో అనుపమ చోప్రా ఇంటర్య్వూ

Posted: 03/12/2016 04:46 PM IST
Anupama chopra interview with pawan kalyan

హంగు హార్భాటాలకు దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇంటర్వ్యూ అంటే ఏదో నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాకుండా మనసులోని మాటలను బయటకు చెప్పారు పవన్ కళ్యాణ్. తెలుగులో ఓ పవర్ స్టార్ గా, జనసేన పార్టీ అధినేతగా పవన్ రెండు రోల్స్ చేస్తున్నారు. అయితే త్వరలోనే తాను సినిమాలకు సెలవు ప్రకటించినున్నానని వెల్లడించారు. అంతేకాకుండా ఖాళీ సమయాల్లో తాను ఏం చేస్తుంటాడో కూడా పవన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదుగుతున్న నిష్కల్మష నాయకుడు. చాలా మంది నేతలు ఉండొచ్చు.. చాలా మంది యాక్టర్లు ఉండవచ్చు కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, పవన్ లాంటి నేచురల్ యాక్టర్ మాత్రం ఉండరు. తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ.. తన ఆలోచనా విధాలను ఇంటర్వూలో మన కళ్ల ముందు ఆవిష్కరించాడు. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు మీకు అందిస్తున్నాము.

* నేను అనుకోకుండా యాక్టర్ గా మారాను.. కానీ నాకు ఎప్పుడూ రైతుగా ఉండాలనే కోరిక
* సినిమాల్లో భారీ డైలాగులు కొట్టినా కూడా వాటిని నేను ఫాలో అవను.. పట్టించుకోను. అవి నాకు బోర్ కొట్టాయి.
* నా నిజ జీవితంలో నా వాయిస్ ను వినిపించడానికే పాలిటిక్స్ లోకి వచ్చాను
* సినిమాలు ఒక్కటే ప్రపంచం కాదు.. జీవితం అనే సినిమాలకన్నా పెద్దది

* హావ భావాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి అని నేను నమ్ముతాను.. అందుకే నాతో నేను నిజాయితీగా ఉండాలనుకుంటాను.
* నిజ జీవితాల్లో అందరూ కూడా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కానీ నేను అలాంటి క్యారెక్టర్ ను చెయ్యలేను.. అందుకే నేను మంచి యాక్టర్ ను కాదు అని అనుకుంటుంటాను.
* నేను కష్టపడటం లేదు అని కొంత మంది అనుకుంటున్నారు కానీ అది ఎంత మాత్రం నిజం కాదు.
* షూటింగ్ లేనప్పుడు పుస్తకాలు చదువుతుంటాను.. గడ్డం పెంచుతాను.
* నేను లా అండ్ ఆర్డర్ గురించి లోతుగా ఆలోచిస్తాను. వాటిని మరింత బలోపేతం చెయ్యడానికి కృషి చేస్తాను.
* నేను ప్రస్తుతం సినిమాల మీద మాత్రమే దృష్టిసారించాను. నేను బ్రతకడానికి అవసరమైన సినిమాలు చేస్తున్నాను. కానీ మరి కొన్ని సంవత్సరాల్లోనే నేను సినిమాలను వదిలేస్తాను
* సినిమాలు వదిలేసిన తర్వాత రచనలు చెయ్యడానికి ఇష్టపడతాను. ఎందుకంటే యాక్టింగ్ చెయ్యాలంటే బాగా కష్టపడాలి.. డైరెక్టర్ కావాలంటే కూడా కష్టపడాలి.. కానీ రాయాలంటే తీరిక ఉంటే చాలు రాసుకోవచ్చు.
* మీ డ్యుటీ మీరు చెయ్యండి అంతే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles