Popular Tamil actor killed in road accident

Tamil actor selva kumae killed in road accident

tamil actor, selvakumar, dead, road accident, Kovai Senthil, chennai, Anniyan, Ramanaa

Popular Tamil character artist Selvakumar died here on Friday in a motorcycle accident.

రోడ్డుప్రమాదంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు మృతి

Posted: 03/12/2016 12:04 PM IST
Tamil actor selva kumae killed in road accident

కాలీవుడ్ పరిశ్రమలోని మరో నటడు నెలకోరిగాడు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో రాణిస్తున్నా నటుడు సెల్వకుమార్ రోడ్డు ప్రమాదంలో అసువులు బాశాడు. కాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సెల్వకుమార్ క్రితం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ఆయన బైక్ బ్రేక్ వైర్ తెగిపోవటంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సెల్వకుమార్ అక్కడికక్కడే మరణించగా ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో నటుడు కోవై సెంథిల్ గాయాలతో బయటపడ్డారు. అనియన్, రమణ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వకుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా సెల్వకుమార్ మరణవార్తతో కాలీవుడ్ పరిశ్రమలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సెల్వకుమార్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamil actor  selvakumar  dead  road accident  Kovai Senthil  chennai  Anniyan  Ramanaa  

Other Articles