Telangana Budget sessions from Today

Telangana budget sessions from today

Telangana, Assembly, Budget, Narasimhan, Governor

Telangana Budget sessions will strat from today 11am. Governor Narsimhan will his speech at Assembly.

నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Posted: 03/10/2016 08:42 AM IST
Telangana budget sessions from today

తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 11 గంటలకు రెండు సభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. సభ వాయిదా తర్వాత.. శాసనమండలి, శాసనసభల బీఏసీ మీటింగ్స్ జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించాలి, ఏయే ఆంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ మీటింగ్ తర్వాత క్లారిటీ రానుంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ అయింది. ఇవాళ్టి నుంచి ఈ నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఉదయం పదకొండు గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ 14 వతేదీన శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది లక్షా ముప్పైవేల కోట్లతో భారీ బడ్టెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

గతంలో పార్టీలు ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్రాధాన్యత ఇచ్చేవి. వాటికి బదులెలా ఇవ్వాలన్నదానిపై అధికారపార్టీ ప్రిపరేషన్స్ చేసుకునేది. కానీ.. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ వ్యూహాలకు పదునుపెట్టాల్సిన అవసరం అధికార పార్టీకి లేకుండాపోయింది. పథకాల అమలులో వస్తున్న సమస్యలు.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తును ప్రభుత్వం వివరించనుంది. అమలు చేస్తున్న.. చేయబోతున్న పనులపై క్లారిటీ ఇవ్వనుంది. ప్రశ్నలు.. జవాబులు అన్నీ తానై టీఆర్ఎస్ వ్యవహరించే అవకాశముంది. పార్టీలనుంచి ఎదురయ్యే సవాళ్లపై పక్కా క్లారిటీతో ఉంది గులాబీ నాయకత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Assembly  Budget  Narasimhan  Governor  

Other Articles