Sidelined by BJP, Yashwant Sinha to help AAP with Delhi budget

Bjp s yashwant sinha to mentor aap leaders for delhi budget

AAP, Aravind kejriwal, Delhi budget, Delhi chief Minister, former Union finance minister, Yashwant Sinha,Union Finance,Manohar Joshi,Finance minister,finance department,finance,Arvind Kejriwal

BJP may have relegated senior leader Yashwant Sinha to the margins in the party, but Delhi Chief Minister Arvind Kejriwal has coopted him as a 'margdarshak' or guide of sorts for the state Budget

ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ కు బీజేపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సాయం..

Posted: 03/09/2016 04:57 PM IST
Bjp s yashwant sinha to mentor aap leaders for delhi budget

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా... నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దాదాపుగా తెరమరుగయ్యారు. మోదీ హవాతో బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తరహాలోనే సిన్హా కూడా తెర వెనుకకు వెళ్లక తప్పని పరిస్థితి. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు దఫాలుగా బడ్జెట్ రూపకల్పనలో తనదైన ముద్ర వేసేవారు. వాజ్ పేయి కేబినెట్ లో సిన్హా ఓ వెలుగు వెలిగారు. తదనంతర కాలంలో ఆయన విధానాలు పార్టీకి నచ్చలేదు.

అయితే బీజేపీ సర్కారుకు నచ్చని సిన్హా చిట్టా పద్దుల రూపకల్పన ఆమ్ ఆద్మీ పార్టీకి నచ్చినట్లుంది. ఈ నెల 15న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ సర్కారు వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ రూపకల్పన శరవేగంగా సాగుతోంది. ఈ కసరత్తులో యశ్వంత్ సిన్హా సలహాలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఇంకేముంది, నేరుగా సిన్హాను సంప్రదించిన ఆప్ సర్కారు, చిట్టా పద్దుల్లో సలహాలివ్వాలని కోరింది. దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియక బీజేపీ డైలమాలో పడిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Aravind kejriwal  yeshwanth sinha  delhi budget  

Other Articles