Mudragada Padmanabham ready to take action plan on Kapu reservations

Mudragada padmanabham ready to take action plan on kapu reservations

Mudragada Padmanabham, Kapu, Kapu Reservations, AP, Chandrababu Naidu

Mudragada Padmanabham ready to take action plan on Kapu reservations He already told to govt for allot funds to kapus commisssion.

నేటితో ముగియనున్న ముద్రగడ డెడ్ లైన్

Posted: 03/10/2016 08:44 AM IST
Mudragada padmanabham ready to take action plan on kapu reservations

ఏపిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి కాపు ఉద్యమం మరోసారి రగులుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పెట్టిన డెడ్ లైన్ ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. తనకు ఇచ్చిన హామీలపై ఈరోజు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మళ్లీ దీక్ష చేపడతానంటూ హెచ్చరించారాయన. అయితే ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆయన దీక్షకు సిద్ధం అవుతున్నారు. కాగా.. ముద్రగడ తీరుపై టీడీపీ మండిపడుతోంది. చర్చలు జరిపేదే లేదంటూ తేల్చేస్తోంది. అటు ముద్రగడ ఇటు ప్రభుత్వం రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో మళ్లీ ఏం జరుగుతోందోనన్న ఆందోళన మొదలైంది.

కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టి అది హింసాత్మకంగా మారడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఆ తర్వాత దీక్షకూ దిగారు. అయితే ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు ఇవ్వడంతో ముద్రగడ తన దీక్ష విరమించారు. కానీ, ప్రభుత్వానికి- ముద్రగడకూ మధ్య కుదిరిన ఒప్పందం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. టీడీపీ నేతలు తమ నోటికి పని చెప్పడంతో అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ముద్రగడ. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  Kapu  Kapu Reservations  AP  Chandrababu Naidu  

Other Articles