car mows down pedestrians in China

Car mows down pedestrians in china

china, accident, CCTV, china Mows

CCTV shows insane moment a car mows down pedestrians in China in a hit and run accident.CCTV shows insane moment a car mows down pedestrians in China in a hit and run accident.

ITEMVIDEOS: కారుతో విద్యార్థులను చంపాలనుకున్నాడు..

Posted: 03/02/2016 12:53 PM IST
Car mows down pedestrians in china

సమాజం మీద కోపంతో ఓ రిటైడ్ ఆఫీసర్ చేసిన నిర్వాకానికి 12 మంది ప్రాణాలకు ముప్పువాటిల్లింది. అసహనంతో తన కారుతో రోడ్డు దాటుతున్న విద్యార్థులను చంపాలని అనుకున్నాడు. అయితే ఓ విద్యార్థి చనిపోగా... మిగిలిన 11 మందికి ప్రాణహాని తప్పింది. చైనాలో ‘మా’ అనే మాజీ ప్రభుత్వాధికారి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సమాజంపై కోపంతో అభంశుభం తెలియని చిన్నారులపై ప్రతీకార దాడికి దిగాడు. అయితే దీనికి సంబందించిన దృశ్యాలు సిసిటివీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వ్యాపిస్తోంది.

చైనాకు చెందిన మా అనే రిటైడ్ అధికారి.. ఈ కిరాతకానికి పాల్పడ్డారు. అయితే కారుతో విద్యార్థులను గుద్దిన వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని వెంటాడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై దర్యాప్తు చేసే నాన్యాంగ్ సిటీ పీపుల్ విభాగంలో పనిచేసిన 'మా' ఓ రిటైర్డ్ దర్యాప్తు అధికారి. సమాజం తీరుపై అసంతృప్తి చెందిన అతను ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న విద్యార్థుల సమూహంపై బీవైడీ మోడల్ వాహనంతో అతడు దూసుకుపోయాడు. విద్యార్థుల లక్ష్యంగా తన కారును వేగంగా నడుపడంతో దాదాపు 12 మంది చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. కాగా వెంటనే వద్యార్థులను స్థానిక ఆస్పత్రనికి తరలించారు. అందులో ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించి. మరణించారు. మిగిలిన 11 మంది విద్యార్థులు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  accident  CCTV  china Mows  

Other Articles