DNA TESTS PROVE RETIRED POSTMAN HAS OVER 1,300 ILLEGIMITATE CHILDREN

Dna tests prove retired postman has over 1 300 illegimitate children

DNA, Test, 1300 children, Retied Postman

The investigation that has gathered thousands of DNA samples and testimonies over a 15-year period ultimately proves the man is the father to literally thousands of illegitimate children in the region.“Contraception wasn’t very popular in those days,” he told local reporters in his defense. “I have nothing to be ashamed of. The 60s were the good old days and I did a great Johnny Cash impression which played out real good with the ladies

ఒక్క వ్యక్తి.... 1300 మంది పిల్లలు

Posted: 03/02/2016 11:17 AM IST
Dna tests prove retired postman has over 1 300 illegimitate children

చైనాలో ఒక్కరు చాలు అని, మన దేశంలో అయితే ఇద్దరు చాలు అని ప్రచారం నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అందరిని భయపెడుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను కనాలంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం 1300 మంది పిల్లలను కన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవును.. అతని వల్ల 1300 మంది పుట్టారట. ఓ డిటెక్టివ్ కనుగొన్న విషయాలు అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 1300 మంది పిల్లలు పుట్టడానికి కారణమైన వ్యక్తి.. వీర్యాన్ని దానం చేసే వాడు కాదు(స్పెర్మ్ డోనర్) ఓ మామూలు రిటైడ్ పోస్ట్ మాస్టర్. ఇప్పుడు 85  ఏళ్లు వయసుకు చేరుకున్న ఆ మాజీ పోస్ట్‌ మాస్టర్‌ రాసలీలలకు ప్రతిఫలమే ఈ అక్రమ సంతానం.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. అలాగని ఆ వ్యక్తి స్పెర్మ్‌ డోనర్‌ కాదు. ఓ రిటైర్డ్‌ పోస్ట్‌ మాస్టర్‌ రాసలీల ఫలితంగా పుట్టిన దాదాపు 1300  మంది పిల్లల పుట్టుకను ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కనిపెట్టాడు. దీని కోసం 15 ఏళ్లపాటు ఎంతో కష్టపడి వేల మంది డీఎన్‌ఏ సేకరించి ఈ విషయం బయటపెట్టాడు. 2001వ సంవత్సరంలో తన వద్దకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వచ్చి, డీఎన్‌ఏ శాంపిల్స్‌ ఇచ్చి తమ తండ్రులెవరో కనిపెట్టమన్నారని.. ఆశ్చర్యకరంగా వారిద్దరి తండ్రీ ఒకరేనని తెలిసిందని ఆయన అన్నారు. అప్పుడు మొదలైన ఈ ఆపరేషన్..‌. తన వద్ద ఉన్న శాంపిల్స్‌లో చాలా ఈ డీఎన్‌ఏతో సరిపోయాయి. ఇప్పటి వరకు ఆ వ్యక్తి వల్ల 1300 మంది ప్రాణం పోసుకున్నట్టు తన పరిశోధనలో తేలిందని అన్నారు. కాగా, ఈ విషయాన్ని ఆ మాజీ పోస్ట్‌ మాస్టర్‌ ఖండించలేదు. ఆ రోజుల్లో గర్భనిరోధక మాత్రలు గురించి తనకు పెద్దగా అవగాహన లేదని ఓ విలేకరితో నవ్వుతూ చెప్పాడు. 1960ల్లో తన జీవితంలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని, అయినా తను చేసిన పనులకు పశ్చాత్తాపం పడటం లేదని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DNA  Test  1300 children  Retied Postman  

Other Articles