Mudragada Padmanabham again ready to stage strike for Kapu Reservation

Mudragada padmanabham again ready to stage strike for kapu reservation

Mudragada Padmanabham, Mudragada, Kapu, Kapu Reservations, kapu Nadu, AP, Chandrababu Naidu

Mudragada Padmanabham again ready to stage strike for Kapu Reservation. He siad that Chandrbabu Naidu cheat him.

ITEMVIDEOS: చంద్రబాబు మోసం చేశాడంటున్న ముద్రగడ

Posted: 03/02/2016 01:01 PM IST
Mudragada padmanabham again ready to stage strike for kapu reservation

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలను నమ్మి దీక్ష విరమించామని, ఆయన ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే మరోసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు ముద్రగడ తెలిపారు. మళ్ళీ రోడ్డెక్కడానికి తాను సిద్ధమని ఆయన చెప్పారు. చంద్రబాబువి మోసపూరిత హామీలని తనకు ఫోన్లు వస్తున్నాయని ముద్రగడ అన్నారు. బాబును నమ్మి దీక్ష విరమించినందుకు సిగ్గుపడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్ష ఎవరికీ వ్యతిరేకం కాదని, కొందరు కావాలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ముద్రగడ చెప్పారు. కాపులకు .500 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని చెప్పిన బాబు దాన్ని పక్కన పెట్టి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారని వెల్లడించారు. అలా దాటవేత ధోరణిలో చెప్పడం మోసమని..  చంద్రబాబును నమ్మడం పొరపాటయిపోయిందని ఆయన తెలిపారు. మరో రెండు రోజుల్లో జిల్లాల్లో పర్యటించి, భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తామని ముద్రగడ వెల్లడించారు. 

మరోసారి ఏపి అగ్నిగుండంగా మారనుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ముద్రగడ చేసిన ఉద్యమం ఏపిలో భయానక వాతావరణాన్ని సృష్టిచింది. ముద్రగడ సభ పేరుతో ఉద్యమానికి తెర తీయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తర్వాత ఆయన చేసిన నిరాహార దీక్ష కూడా ప్రభుత్వానికి చెమటలు పట్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles