anti rajagopal political re entry posters rock controversy in bejawada

Anti lagadapati rajagopal posters rock vijayawada

lagadapati rajagopal, bjp, posters, vijayawada, andhra pradesh, lanco power plant, 75000 croresm anti rajagopal posters, bejawada

anti posters controversy rock in vijayawada as former vijayawada member of parliament and pepper spray mp lagadapati rajagopal may join bjp.

లగడపాటి రాజకీయ పునరాగమనానికి వ్యతిరేకంగా బెజవాడలో పోస్టర్లు..

Posted: 02/16/2016 03:00 PM IST
Anti lagadapati rajagopal posters rock vijayawada

కేంద్రం రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాజీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్.. కనీసం రెండు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా వుండలేక పోతున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తన జన్మదినాన్ని పురస్కరించుకుని మరోమారు రాజకీయ ఆరంగ్రేటం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ విజయవాడలో ప్లెక్సీలు వెలిసాయి. అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి రావద్దూ అంటూ లగడపాటి రాజకీయ పునరాగమనాన్ని వ్యతిరేకిస్తూ కూడా పలు ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది.

గతంలో రాజకీయాల్లో ఆయన అక్రమంగా రూ. 75 వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, ఇప్పుడు మరలా రాజకీయాల్లోకి వచ్చి మరింత దోచుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నిస్తూ, కొందరు ప్లెక్సీలను కట్టారు. "75 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని, బ్యాంకులను ముంచి, కుటుంబం పేరు మీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడ పెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. కొత్తగా రాజకీయ్యాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ... మీ అభిమానులు" అని రాసివుంది. మధ్యలో "చాలవు... ఇంకా కావాలి" అన్న స్లోగన్ కూడా ఉంది. వీటిని చూసిన లగడపాటి అభిమానులు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ నేతకు వ్యతిరేకంగా ఉన్న ప్లెక్సీలను లగడపాటి అనుచరులు చించివేశారు. పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lagadapati rajagopal  bjp  posters  vijayawada  andhra pradesh  

Other Articles