supreme court rules out opposition leader status for sonia gandhi

Supreme rules out opposition status to congress

Supreme Court,Congress party,sonia gandhi, leader of opposition, no status of opposition Leader,Lok Sabha, New Delhi, Randeep Singh Surjewala,Amit Shah,Rahul Gandhi,JNU,Kanhaiya Kumar

Supreme Court told the Congress party that its leader could not enjoy the status of the Leader of the Opposition in the Lok Sabha because the party had got only 44 seats in the House.

కాంగ్రెస్ పార్టీకి సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బ..

Posted: 02/16/2016 02:57 PM IST
Supreme rules out opposition status to congress

పార్లమెంటు్లో అధికార ఎన్డీఏ ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని.. తమకు న్యాయం చేయాలని అటు స్పీకర్ కూడా న్యాయం చేయలేరని భావించిన కాంగ్రెస్.. ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. అయితే అక్కడ కూడా కాంగ్రెస్ కు ఎదురు దెబ్బే తగిలింది. గత పదేళ్ల కాలం పాటు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదాకు ఏదైనా పార్టీకి కావాల్సిన 55 సీట్లు కూడా కాంగ్రెస్ కు రాకపోవడంతో ఆ పార్టీకి సదరు హోదాను కల్పించలేమని స్పీకర్ సుమిత్ర మహాజన్ గతంలోనే తేల్చిచెప్పారు.

అంతేకాదు ఇందుకు సంబంధించి గతంలో పార్లమెంటులో ఇలాంటి పరిస్థితులు పునరావృతమైన ఉదంతాలను కూడా పేర్కొంది. అయినా దాంతో సర్థిపెట్లుకోలేక పోయిన కాంగ్రెస్.. తమ అధినేత్రికి ప్రతిపక్ష నాయకురాలిగా హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. అంతటితో ఆగకుండా దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు తీర్పును వెలువరించిన న్యాయస్థానం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పింది. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ప్రతిపక్ష నాయకురాలుగా హోదా కల్పించలేమని చెప్పింది. ఇ:దుకు సంబంధించి కాంగ్రెస్ కు ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్యలో స్థానాలు రాలేదని, ఆ పార్టీకి కేవలం 44 స్థానాలు మాత్రమే రావడంతో హోదా కల్పించలేమని చెప్పింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Congress party  sonia gandhi  leader of opposition  

Other Articles