TDP and BJP candidate loss deposit in narayankhed bypolls

Tdp and bjp candidate loss deposit in narayankhed bypolls

Narayankhed, NarayanKhed Bypolls, TRS, TDp, BJP, Revanth Reddy, Chandrababu Naidu

TRS bags the NarayanKhed Bypolls. The TDP and BJP candidate did not get one by six majority so he loss the deposit.

టిడిపి-బిజెపి డిపాజిట్ గల్లంతు

Posted: 02/16/2016 01:16 PM IST
Tdp and bjp candidate loss deposit in narayankhed bypolls

పాపం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గడ్డు కాలం నడుస్తోంది అని అందరికి తెలుసు. గత ఎన్నికల నుండి కూడా తెలుగుదేశానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం సీన్ సితారైంది. బలం లేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లు విరిగినట్లుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఒకే ఒక్క కార్పోరేటర్ గెలుపొందగా తాజాగా అలాంటి విపత్కర పరిస్థితే ఎదురైంది. నారాయణ్ ఖేడ్ ఎన్నికలు మరోసారి తెలుగుదేశం పార్టీ బ్యాడ్ టైం ను గుర్తు చేసింది. ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి నాయకులు. చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండ పండితులు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.

నారాయణఖేడ్‌ బైపోల్‌లో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ రావాలంటే 25 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంది. కానీ టీడీపీ ఆ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది. టీడీపీ కేవలం 14 వేల 787 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ 39 వేల 451 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్‌ 53వేల 625 ఓట్ల మేజారిటీతో విజయం సాధించింది. ఆ పార్టీకి మొత్తం 93 వేల 76 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చాలా రౌండ్లలో వెయ్యి ఓట్లను కూడా సాధించలేకపోయింది. కేవలం నాలుగు రౌండ్లలో మాత్రమే వెయ్యికి మించి ఓట్లను సాధించగలిగింది. అలా మొత్తానికి నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి ఉమ్మడి అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం విశేషమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narayankhed  NarayanKhed Bypolls  TRS  TDp  BJP  Revanth Reddy  Chandrababu Naidu  

Other Articles