TRS Won in Narayankhed by polls

Trs won in narayankhed by polls

TRS, narayanKhed, TRS Won in Narayankhed, Harish Rao

TRS party bags narayankhed bypolls. TRS party candidate Bhupal Reddy won by fifty three thosuand six hundred twenty five votes.

నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ఘన విజయం

Posted: 02/16/2016 11:59 AM IST
Trs won in narayankhed by polls

నారాయణ్ ఖేడ్ లో గులాబీ జెండా ఎగిరింది. టిఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా సత్తా చాటారు. ‘గెలుపు సారధి’గా పేరొందిన ఆయన మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో తన పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను చేజిక్కించుకుని ఆయన టీఆర్ఎస్ అభ్యర్థికి ఘన విజయం సాధించి పెట్టారు.

నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయభేరి మోగించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 39 వేల ఓట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా, టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే 21 రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యంతో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. 21 రౌండ్లలోనూ టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచి విజయాన్ని సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  narayanKhed  TRS Won in Narayankhed  Harish Rao  

Other Articles