KTR tweet after the narayankhad bypolls win

Ktr tweet after the narayankhad bypolls win

Harish Rao, KTR, Twitter, Facebook, KTR Tweet

Telangana IT Minister KTR wish Harish Rao in tweet after narayanKhed win. Harish Rao also post a video in the facebook page

టిఆర్ఎస్ గెలుపు మీద కేటీఆర్ ట్వీట్.. హరీష్ వీడియో

Posted: 02/16/2016 01:50 PM IST
Ktr tweet after the narayankhad bypolls win

నారాయణ్ ఖేడ్ లో గులాబీ జెండా ఎగిరింది. హరీష్ రావు అన్న ప్రకారంగానే నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి. ఖేడ్ గెలుపుపై మంత్రి హరీష్ ను అభినందించారు కేటీఆర్. అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు అభినందనలు చెప్తూ ట్వీట్ చేశారు. హరీష్ తో పాటు మెదక్ జిల్లా టీఆర్ఎస్ యంత్రాంగం కష్టం వల్లే ఈ విజయం సొంతమైందన్నారు కేటీఆర్. ఇక హరీష్ రావు కూడా తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. కాంగ్రెస్ కంచుకోటగా బీటలు వారింది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈనెల 13న నిర్వహించిన పోలింగ్ లో నియోజకవర్గంలోని మొత్తం 1,88,373 ఓటర్లకు 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి 93,076, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451, టీడీపీ అభ్యర్థి విజయపాల్ రెడ్డికి 14,787 ఓట్లు, శ్రమజీవిపార్టీ అభ్యర్థి భాస్కర్ కు 5,377, స్వంతంత్ర అభ్యర్థులు సంగారెడ్డికి 509, మాదప్పకు 235, వెంకటేశానికి 291, మురళీ గోవింద్ కు 333 ఓట్లు పోలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rao  KTR  Twitter  Facebook  KTR Tweet  

Other Articles