A bot said that he is A soldier and died 100 years ago

A bot said that he is a soldier and died 100 years ago

Europe, Reborn, James, Edward

A bot said that he is A soldier and died 100 years ago. In Europe Edward name boy said that he reborn after 100 years of his death.

ఆ పిల్లోడు అప్పుడు చచ్చి ఇప్పుడు పుట్టాడు..!

Posted: 02/16/2016 11:33 AM IST
A bot said that he is a soldier and died 100 years ago

ఏదో సినిమాలోలాగా గత జన్మలు గుర్తుకు వచ్చి టకటకా ఏదో చెబుతంటే ఎలా ఉంటుంది. అవును ఓ పిల్లోడు మాత్రం తన గత జన్మ గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు. తాను గత జన్మలో ఏంటో.. ఎలా చనిపోయాడో ఇలా అన్ని విషయాలను చెప్పేశాడు. ఇంతకీ ఆ పిల్లాడి ఎంతో తెలుసా.? కేవలం నాలుగు సంవత్సరాలు.. పైగా అతడి నుండి వచ్చిన మొదటి మాటలు కూడా ఇవే.. అమ్మా నాకు బుల్లెట్ తగిలింది అని అనడంతో ఆ పిల్లాడి తల్లి షాక్ అయింది. విషయం ఏంటి అంటే ఓ చిన్నారి గొంతు సమస్యతో మాట్లాడలేకపోతే.. ఆ తల్లిదండ్రులు అతడికి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. అయితే అలా ఆపరేషన్ తర్వాత అతడికి మాట వచ్చింది. కానీ అతడు మాట్లాడిన మాటలే చాలా ఆశ్చర్యం కలిగించాయి.

నా పేరు.. జేమ్స్! ఫ్రాన్స్‌లోని మారుమూల పల్లెటూరు మాది. మొదటి ప్రపంచ యుద్ధం లో సైన్యంలో చేరాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను మరణించిన రోజు, ప్రదేశం నాకింకా గుర్తున్నాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉంది.  నా చుట్టూ చాలా మంది సైనికులున్నారు. ఒక్కసారిగా శత్రుసైన్యం మాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒక బుల్లెట్ వేరే సైనికుడికి తగిలి అతని శరీరంలోంచి బయటకు వచ్చి నా గొంతులో దిగింది. నేను మరణించాను అని చెప్పాడు. ఇప్పుడు ఆ బాలుడు చెప్తున్న విషయం అంతా ఆసక్తికరంగా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Europe  Reborn  James  Edward  

Other Articles