Karnataka Home Minister says Tanzanian girl wasn't stripped

Karnataka home minister says tanzanian girl wasn t stripped

Karnataka, Home Minister, Tanzania, Bengalore, bengaluru

Karnataka Home Minister G Parameshwara on Thursday claimed that Tanzanian woman, who was assaulted by a mob in Bengaluru, was not stripped or paraded naked. In a faux pas during his press conference, the minister named the Tanzanian woman.

ఆమెను వివస్ర్తను చెయ్యలేదంటున్న కర్ణాటక హోంమంత్రి

Posted: 02/04/2016 03:45 PM IST
Karnataka home minister says tanzanian girl wasn t stripped

బెంగళూరులో ఓ టాంజానియా అమ్మాయిని తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమెను వివస్ర్తను చేసి... ఆమె కారును తగలబెట్టడం మీద దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. అయితే నిన్నటి ఘటన మీద కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర్ వివరణ ఇచ్చారు. యువతిని వివస్త్రను చేసి ఊరేగించారనే వార్తలను కొట్టిపడేశారు. ఈ వార్త అసత్యమని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనపై విదేశాంగ శాఖకు సమాచారం అందించామని వివరణ ఇచ్చారు. మొత్తం 12 వేల మంది విదేశీ విద్యార్థులు బెంగళూరులో చదువుకుంటున్నారని తెలిపారు. వారి రక్షణ బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బెంగళూరు శివారులోని హేసరఘట్ట రోడ్డులో ఓ కారు వేగంగా వచ్చి 35ఏండ్ల మహిళను ఢీకొంది. స్థానికులు అక్కడికి చేరుకొనేసరికి ప్రమాదానికి కారణమైన కారు ఉడాయించింది. ప్రమాదంలో గాయపడ్డ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. కోపోద్రిక్తులైన స్థానికులు.. కారును వెతికే పనిలోపడ్డారు. అదే సమయంలో తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న టాంజానియాకు చెందిన 21ఏండ్ల విద్యార్థిని.. ప్రమాదాన్ని చూసి సంఘటన స్థలానికి చేరుకుంది.ఆమె యాక్సిడెంట్ చేసిందంటూ చుట్టుపక్కలి వాళ్లు ఆమెను కొట్టడమే కాకుండా  వివస్త్రను చేసి పరిగెత్తించారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె కారును కూడా కాల్చినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Home Minister  Tanzania  Bengalore  bengaluru  

Other Articles