Congress Senior leader Ponnam Prabhakar demand to suspend Balakrishna

Congress senior leader ponnam prabhakar demand to suspend balakrishna

Balakrishna, Ponnam Prabhakar, Hindupur, Balakrishna Vote, GHMC, GHMC Polls

Congress Senior leader Ponnam Prabhakar demand to suspend Balakrishna. He said that Balakrisha, who is present Hindupur MLA, how can he vote in telangana

ఓటేసినందుకు బాలకృష్ణ మీద అనర్హత వేటు వెయ్యాలి

Posted: 02/04/2016 03:01 PM IST
Congress senior leader ponnam prabhakar demand to suspend balakrishna

తాజాగా హీరో, హిందుపురం ఎమ్మెల్యే మీద ఓటు వివాదం మొదలైంది. బాలకృష్ణ మీద అనార్మత వేటు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతూ తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ ఎలా ఓటు వేస్తారని టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాకు చెందిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ డివిజన్ లో ఓటు వేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసనసభకు పోటీ చేయొచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Ponnam Prabhakar  Hindupur  Balakrishna Vote  GHMC  GHMC Polls  

Other Articles