Power cut power is enough for Vote

Power cut power is enough for vote

KCR, Telangana, TRS, GHMC, GHMC Elections, Power cuts in Telangana, Moosi river, GHMC Polls

Telangana cm KCR conduct a press meet in Telangana Bhavan. He said that Power cut power is most powerfull reason for voting. If TRS will win moosi river will be cleaned.

ఓటెయ్యడానికి కోతలులేని కరెంట్ చాలు: కేసీఆర్

Posted: 01/28/2016 04:11 PM IST
Power cut power is enough for vote

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యడానికి కోతల్లేని కరెంట్ చాలు అని సీఎం కేసీఆర్ అన్నారు.  రాష్ట్రం విడిపోతే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని విష ప్రచారం చేశారు. 30 ఏళ్ల పాటు నెలకొన్న దుస్థితికి, విష ప్రచారాలకు తెరదించాం. ఇప్పుడు నగరంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. గతంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఎవరికి ఓటు వేస్తే సత్ఫలితాలు వస్తాయో మేధావులు, విజ్ఞులు ఆలోచించాలి. ప్రస్తుత తరుణంలో ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి. పండ్ల చెట్టు పెడితే పండ్లే వస్తాయి. ముండ్ల చెట్టు పెడితే ముండ్లే వస్తాయి. ఏ చెట్టు పెడితే మంచి ఫలాలు వస్తాయో ప్రజలు, మేధావులు ఆలోచించుకోవాలి. ఓటు వేసే విషయంపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు పార్టీల నిబద్ధతను కూడా పరిశీలించాలని సూచించారు.  ఫిబ్రవరి 2న జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలంతా పాల్గొనాలని సీఎం కేసీఆర్ కోరారు. జంట నగరాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరు అనే అపవాదు ఉంది. ఈ అపవాదును జంటనగరాలు పారద్రోలాలి. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యస్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలి. గ్రేటర్ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  TRS  GHMC  GHMC Elections  Power cuts in Telangana  Moosi river  GHMC Polls  

Other Articles