balakrishna opens up on cabinet berth, says will perform duties with responsibility

Will perform cabinet duties with responsibility if given says balakrishna

mokshagna to debut in balakrishna 100th movie, balakrishna son mokshagna, balakrishna, mokshagna, Dictator, sankranthi, naravaripalle, balakrishna on cabinet, balakrishna chandrababu, balakrishna naravaripalle, balakrishna forthcomming movies, balakrishna 100th film mokshagna

tollywood hero, hindupur mla Balakrishna, brother-in-law of CM Naidu says he will perform his duties with responsibility

క్యాబినెట్ బెర్తుపై పెదవి విప్పిన బాలయ్య, సమర్థవంతంగా పనిచేస్తానని వ్యాఖ్య

Posted: 01/15/2016 05:33 PM IST
Will perform cabinet duties with responsibility if given says balakrishna

కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.  ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,దేవుడు చల్లని చూపు చూడాలని, పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. అయితే అవకాశం వస్తే సమర్థవంతంగా పని చేస్తానని బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలకృష్ణ అన్నారు.

ఇక తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 'చివరికి సినిమాల్లోకే రావాలి కదా...నా వందో సినిమాలో మా అబ్బాయి నటించవచ్చు' అని తెలిపారు. డిక్టేటర్ సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ...అభిమానులకు ఆ సినిమా ఫుల్ ప్లేట్ మీల్స్గా ఉందని, అన్ని అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు బాలయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  hindupur  naravaripalle  sankranthi  

Other Articles