Tearful Obama Outlines Steps to Curb Gun Deaths

Tearful obama outlines steps to curb gun deaths

Obama, America, Gun culture, Guns in America

Tears streaming down his face, President Obama on Tuesday condemned the gun violence that has reached across the United States as he vowed to take action to curb the bloodshed with or without Congress.

మీటింగ్ లో ఏడ్చిన ఒబామా.. ఎందుకంటే

Posted: 01/06/2016 09:52 AM IST
Tearful obama outlines steps to curb gun deaths

అమెరికా అద్యక్షుడు బరాక్ ఓబామా గురించి అందరికి తెలుసు. ఫీలింగ్స్ ను బయటకు ఎక్స్ ప్రెస్ చెయ్యడంలో తాను ఓ అద్యక్షుడిని అన్న విషయాన్ని మరిచిపోతారు. నవ్వడం ఏడవడం కోపంగా ఉండట లాంటివి ఒబామా మొహంలో క్లీయర్ గా కనిపిస్తాయి. అయితే తాజాగా ఓ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. పరిస్థితిలో మార్పు రావాలని ఆయన తన ప్రసంగంలో కోరారు. అయితే ఒబామా ఏడవడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది.

మూడేళ్ల క్రితం కనెక్టికట్  20 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ముష్కరుల తుపాకీ గుళ్లకు బలైన విషయాన్ని గుర్తు చేసుకుని  అమెరికా అధ్యక్షుడు ఒబామా కన్నీరు పెట్టారు.  ఆ చిన్నారులు గుర్తొచ్చిన ప్రతీసారి పిచ్చివాడిగా మారుతున్నానని వెల్లడించారు. చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా.. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ  హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్‌ను డిమాండ్ చేయాలని అన్నారు.  తుపాకుల అమ్మకాల  కట్టడికి కాంగ్రెస్ వ్యతిరేకతను పట్టించుకోకుండా.. కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఒబామా నిర్ణయించారు. గన్ లాబీ కాంగ్రెస్‌ను బందీగా చేసుకోగలదేమో కానీ అమెరికాను కాదని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  America  Gun culture  Guns in America  

Other Articles