Investigating agencies are now alleging that Gurdaspur SP Salwinder Singh

Investigating agencies are now alleging that gurdaspur sp salwinder singh

SP Salwinder Singh, Gurdaspur, Jaish-e-Mohammad, ISI, Pakistan, Pathankot

Investigating agencies are now alleging that Gurdaspur SP Salwinder Singh, who was initially credited for alerting Indian authorities, may be working with Pakistan Army's intelligence wing ISI and the militant organisation Jaish-e-Mohammad.

ఉగ్రదాడిలో ఆ ఎస్సీనే కీలకం..?

Posted: 01/06/2016 09:57 AM IST
Investigating agencies are now alleging that gurdaspur sp salwinder singh

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి వెనక కుట్ర దాగి ఉందా ? పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో ఉగ్రవాదులు ఎలా సరిహద్దు దాటారు ? వీరికి ఎవరైనా సాయం చేసి ఉంటారా ? ఇవే అనుమానాలు ఇప్పుడు ఎన్‌ఐఏ బృందానికి తలెత్తుతున్నాయి. ఉగ్రదాడికి.. గురుదాస్‌పూర్‌ ఎస్పీ కిడ్నాప్‌ కు ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడిలో అసలైన ద్రోహి ఎస్పీ సల్వీందర్‌సింగేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులు తమను కిడ్నాప్‌ చేశారని.. సల్వీందర్‌సింగ్‌, అతని మిత్రుడు రాజేష్‌, వంటమనిషి మదన్‌గోపాల్‌ చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇవే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భారీ విధ్వంసమే లక్ష్యంగా దేశంలోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు.. పోలీసు అధికారి అని తెలిసిన తర్వాత కూడా సల్వీందర్‌సింగ్‌ను వదిలిపెట్టడమేంటి ? ఎస్పీ, వంటమనిషి విప్పుకునేలా కట్టుకట్టి రోడ్డు పక్కన వదిలేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎస్పీ స్నేహితుడు రాజేష్‌ను కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత గొంతు గోసి వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ బృందం ఎస్పీ సల్వీందర్‌సింగ్‌పై దృష్టి సారించాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పాక్‌ ఐఎస్‌ఐతో పాటు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో ఆయనకు సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడుల వెనుక ఎస్పీ అత్యంత కీలక సమాచారం ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎస్పీ వ్యవహారంగా అనుమానాస్పదంగా ఉందని.. మాటలు పొంతన లేకుండా ఉన్నాయని ఎన్‌ఐఏ డీజీ శరద్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఎస్పీని ప్రత్యక్షసాక్షిగానే భావిస్తున్నామని.. పరిస్థితులను బట్టి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SP Salwinder Singh  Gurdaspur  Jaish-e-Mohammad  ISI  Pakistan  Pathankot  

Other Articles