TDP and BJP trying to bring Pawan Kalyan into GHMC field

Tdp and bjp trying to bring pawan kalyan into ghmc field

TDP, BJP, GHMC, Pawan Kalayan, Pawan Kalyan in GHMC, Janasena, janasena Party, GHMC Elections

Telugudesam party and BharatiyaJanataParty leaders expected that If Pawan Kalyan campaign in the support to TDP and BJP alliance, definetly will get good result.

పవన్ కోసం ఆరాటపడుతున్న టిడిపి, బిజెపి

Posted: 01/06/2016 09:49 AM IST
Tdp and bjp trying to bring pawan kalyan into ghmc field

ఏపిలో తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీలకు తన మద్దతు ప్రకటించి. వారి తరఫున ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు సినిమా ప్రముఖుడు పవన్ కళ్యాణ్ కోసం తెలుగు తమ్ముళ్లు, కమలదళం నాయకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ా పార్టీలకు పవన్ సపోర్ట్ చెయ్యడంతో ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. అటు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల పెరుగుదలలో రెండు పార్టీలకు వవన్ ఎంతో మేలు చేశారు. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సహాయాన్ని కోరుకుంటున్నాయి. అందులో బాగంగా పవన్ సహాయం కోసం తెలుగు తమ్ముళ్లు, బిజెపి నాయకులు తహతహలాడుతున్నారు.

వారంలోపు జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో అన్ని పార్టీలు జోరుపెంచాయి. అయితే టిడిపి, బిజెపి పార్టీలకు తగిన ప్రచారం మాత్రం కొరవడింది. అందుకే పవన్ కళ్యాణ్ ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చి ఎన్నికల్లో ఎంతో కొంత లాభపడాలని భావిస్తున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కోసం ఫోన్ కూడా చేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరగా, అందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రచారం నడుస్తోంది. అయితే దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకుంటుందా అని అడిగితే మాత్రం పవన్ దానికి ఇంకా టైం ఉంది అని సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  BJP  GHMC  Pawan Kalayan  Pawan Kalyan in GHMC  Janasena  janasena Party  GHMC Elections  

Other Articles