we will hit centuryTalasani srinivas said

We will hit centurytalasani srinivas said

TRS, GHMC, Talasani Srinivas, Talasani, GGHMC Elections

Telangana Minister Talasani Srinivas Yadav said that they will hit century in the GHMC elections. TRS will swipe GHMC elections.

సెంచరీ పక్కా అంటున్న తలసాని

Posted: 01/04/2016 08:06 AM IST
We will hit centurytalasani srinivas said

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా సెంచరీ గ్యారంటీ అంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద డివిజన్లలో విజయఢంకా మోగించి జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్, వరంగల్ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీహెచ్‌ఎంసీలో పునరావృతమవుతాయని ఆయన అన్నారు. నగరంలో ఇవాళ ఏ దారి చూసినా టీఆర్‌ఎస్ భవన్ వైపే వెళుతున్నదని..నెల రోజులుగా ఇతర పార్టీల నుంచి నాయకులు టీఆర్‌ఎస్‌లో వెల్లువలా చేరుతున్నారని అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీపరంగా డివిజన్లవారీగా కమిటీలను వేసుకొని ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. 19 నెలల కాలంలో రాష్ట్రంలో మంచి పురోగతి ఉందని అంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రచారాస్ర్తాలుగా ఎన్నికలకు వెళతామన్నారు. ప్రధానంగా ఆసరా పింఛన్లు, 4 కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచిన రేషన్ బియ్యం తదితర అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేకుండా అంతా సమన్వయంతో పని చేస్తామని మంత్రి తలసాని అన్నారు. ఒక డివిజన్‌లో ఒకరికి మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని, టికెట్ రాని వారికి పార్టీలో ఇంకా అనేక ఇతర అవకాశాలు లభిస్తాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  GHMC  Talasani Srinivas  Talasani  GGHMC Elections  

Other Articles