Major earthquake hits northeast India

Major earthquake hits northeast india

earthquake, earthquake in India, Earthquake in North India, Manipur, bangladesh

An earthquake measuring 6.7 magnitude hit northeast India near its border with Myanmar and Bangladesh early Monday, the U.S. Geological Survey (USGS) confirmed. There was no immediate word on casualties.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ భూకంపం

Posted: 01/04/2016 07:36 AM IST
Major earthquake hits northeast india

భారత్‌- మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మణిపూర్ రాజధాని ఇంపాల్ సమీపంలో భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్బశాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగాల్‌లోని సిలిగుడిలో భూప్రకంపనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు 33 కి.మీ దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్ లలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ వ్యక్తి మరణించగా, మరో 8 మంది దాకా గాయపడ్దారు. మిగిలిన ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  earthquake in India  Earthquake in North India  Manipur  bangladesh  

Other Articles