twins born in two different years

Twins born in two different years

Twins, Twins in different years, california, Jealyn, Luis

Twin infants born just as New Year's Champagne corks were popping share the same parents, but different birth years. Maribel Valencia, of San Diego, California made it to a local hospital on Thursday just in time to give birth to a baby girl -- Jaelyn -- in the final seconds of 2015. Jaelyn's brother Luis was born about two minutes into 2016, local media reported.

కవలలే కానీ సంవత్సరం తేడా... వావ్

Posted: 01/04/2016 08:21 AM IST
Twins born in two different years

కవలలకు సంవత్సరం తేడా ఏందనుకుంటున్నారా? ఔను.. టైం కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తుందని ఖచ్చితంగా నమ్మాలి. చాలా మంది తమ పిల్లలు పలానా తేదీనాడు పుడితే మంచిది అని ముందే సిజేరియన్ చేయించుకుంటుంటారు. కానీ ఓ తల్లికి మాత్రం ఇద్దరు కవలలు పుట్టారు. అయితే వాళ్లు ఏకంగా సంవత్సరం తేడాతో పుట్టడం ఆశ్చర్యం. అమెరికాలోని శాండియాగోకు చెందిన వీరి పేర్లు జైలిన్, లూసి. ఒకరు 2015లో పుడితే.. మరొకరు 2016లో పుట్టారు. అంటే.. ఏడాది తేడా! ఏడాదంటే వీరి విషయంలో 365రోజులు కాదు.. రెండు నిమిషాలు మాత్రమే!

2015 డిసెంబర్ 31 అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాలకు జైలిన్ పుడితే.. అదే అర్ధరాత్రి 12 గంటల 01 నిమిషానికి(2016 జనవరి 1 తెల్లవారుజామున) లూసి పుట్టింది. జైలిన్ 2015లో జన్మించినట్టుగా, లూసి 2016లో పుట్టినట్టుగా వైద్యాధికారులు రికార్డు చేశారు. 2015, 2016 సంవత్సరాలు తమ ఇంట కొత్తకాంతులు తీసుకువచ్చాయని ఆ కవలల తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twins  Twins in different years  california  Jealyn  Luis  

Other Articles