Here comes cowfie After selfie

Here comes cowfie after selfie

Cowfie, Selfie, Cow slaugher, Go Seva Pariwar, kokata

a bid to raise awareness about the importance of cow and horror of cow slaughter, an NGO in Kolkata has come up with a novel idea of organising a "selfie with a cow" contest in the city. The 'cowfie' contest was started by "Go Seva Parivar", the NGO, during a month-long online campaign in November inviting people to post selfies with cows. An official of the NGO told PTI that cow protection was not a religious or political issue, but backed by its scientific use.

ITEMVIDEOS: సెల్ఫీ పాయె.. కౌఫీ వచ్చె డాం..డాం..డం

Posted: 01/02/2016 08:49 AM IST
Here comes cowfie after selfie

ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఐస్ బకెట్ చాలెంజ్ నుండి కండోమ్ ఛాలెంజ్ ఇలా కొత్త ట్రెండ్ వస్తూనే ఉంది. అయితే సెల్ఫీలు క్రియేట్ చేసిన ట్రెండ్ ఎలా ఉందో అందరికి తెలుసు. ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ట్రెండ్ సెల్ఫీ. ప్లేస్ ఎక్కడైనా.. సందర్భమేదైనా సరే.. ఓ సెల్ఫీ తీసుకోవాల్సిందే. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు బాగా ఆకట్టుకున్న సెల్ఫీ మంత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ దూసుకెళ్తొంది. ఆడపిల్లల చదువు కోసం ప్రారంభించిన సెల్ఫీ విత్ డాటర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన విషయం తెలిసిందే. తాజాగా గోవుల సంరక్షణార్థం కోల్కతాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ‘సెల్ఫీ విత్ కౌ’ అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది.

గోరక్షణ సమాజానికి శ్రీరామరక్ష అని మనం నమ్ముతాం. అదేబాటలో పయనిస్తోందో సంస్థ. గోవులను పరిరక్షించేందుకు కోల్కతాకు చెందిన ‘గో సేవా పరివార్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘కౌఫీ’ పేరుతో ‘సెల్ఫీ విత్ కౌ’ అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. తమ దృష్టిలో గోవును పరిరక్షించడం మతానికి సంబంధించిన అంశం కాదని.. సైన్స్ పరంగా ఎన్నో ఉపయోగాలున్న గోవును రక్షించుకోవడం మనందరి బాధ్యత అని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఇటీవల దేశంలో గోవధపై వస్తున్న వార్తలు చూసిన అనంతరం ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు తీసుకున్నట్లుగానే.. ఆవుతో ఫొటో దిగి తమకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే విపరీతమైన ఆదరణ లభించింది. చాలా మంది గోవులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని స్వచ్ఛంద సంస్థకు పంపిస్తున్నారు. సెల్ఫీలాగే కౌఫీలు ఇప్పుడు సోషల్ మీడియా నిండా సందడి చేస్తున్నాయి. మీరు కూడా కౌఫీ దిగి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cowfie  Selfie  Cow slaugher  Go Seva Pariwar  kokata  

Other Articles