4 Terrorists Killed In Terror Attack At Air Base In Punjab

4 terrorists killed in terror attack at air base in punjab

punjab, Pathankot, an air force base in Punjab, terror Attack on Air base

At least six terrorists attacked an air force base in Punjab's Pathankot district on Saturday morning. Four terrorists and two security personnel have been killed in the ensuing gunbattle.

ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి

Posted: 01/02/2016 09:11 AM IST
4 terrorists killed in terror attack at air base in punjab

మరోసారి ఉగ్రవాదులు తమ ప్రతాపాన్ని చూపించారు. పంజాబ్ లోని ఓ ఎయిర్ బేస్ మీద దాడికి పాల్పడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగిన ఉగ్రవాదుల్లో నలుగురిని పోలీసులు హతమార్చారు. శనివారం రాత్రి ఒంటి గంట నుంచి ఎయిర్‌బేస్ దగ్గర భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో సెంట్రీ డ్యూటీ చేస్తున్న ఓ ఆర్మీ అధికారి కూడా ఉగ్ర తూటాలకు బలయ్యాడు. మరో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. మొత్తం ఏడు మంది ఉగ్రవాదులు పటాన్‌కోట్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అందులో ప్రస్తుతం నలుగురిని హతమార్చినట్లు తెలుస్తోంది. పఠాన్‌కోట్‌లో మిగ్-21 యుద్ధ విమానాలకు ఎయిర్‌బేస్. ఇది గురుదాస్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉగ్రవాదుల దాడితో పంజాబ్‌లో హై అలర్ట్ జారీ చేశారు.

కాగా ఎయిర్‌బేస్‌లో విమానాలను అన్నీ క్షేమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. హెలికాప్టర్లతో పాటు ఇతర సామాగ్రికి ఎటువంటి నష్టం కలగలేదు. ఎయిర్‌బేస్‌లోని టెక్నికల్ ఏరియాలోకి ఉగ్రవాదులు ప్రవేశించలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో ఆర్మీ ముమ్మర గస్తీ నిర్వహిస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎన్‌ఎస్‌జీ కమాండోలు రంగంలోకి దిగారు. హెలికాప్టర్ల ద్వారా ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఓ పోలీస్ అధికారి కారును హైజాక్ చేసిన ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగారు. ఉగ్రవాదులు జైషే హి మహ్మద్ సంస్థకు చెందినట్లు భావిస్తున్నారు. పఠాన్‌కోట్ దాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఉత్తర భారత దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌బేస్ కేంద్రాల దగ్గర భద్రతను పెంచారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab  Pathankot  an air force base in Punjab  terror Attack on Air base  

Other Articles