Telugu people create New record in dinking liquior

Telugu people create new record in dinking liquior

Liquior, New Year, celebrations, Telangana, Alchohol

Telugu people specially telangana people enjoy the eve of new year. They celebrate the new year by drink more and more liquior.

మందు బాబులం.. మేం మందు బాబులం

Posted: 01/02/2016 08:35 AM IST
Telugu people create new record in dinking liquior

ఏ పార్టీ అయినా సరే పూటుగా తాగి.. ఊగిపోవడం ఇప్పుడు అందరికి అలవాటైంది. అసలే కొత్త సంవత్సర వేడుకలు మామూలుగానే కాలు నేల మీద ఆగదు.. మరి కొత్త సంవత్సరం ఉందంటే మాత్రం తాగి ఊగకపోతే ఎలా. తెలుగు రాష్ట్రాల్లో తాగుబోతులు తమ తాగుడు ప్రతాపాన్ని చూపించారు. కొత్త ఏడాదికి ఆహ్వానం పలికే క్రమంలో అధిక మొత్తంలో మద్యం అమ్ముడయింది. కేవలం గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 100 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖకు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 105 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే దాదాపు 60 కోట్లు దాటినట్టు సమాచారం. న్యూ ఇయర్ ఈవెంట్లు, ఫాంహౌస్‌లలో ప్రత్యేక కార్యక్రమాలు, బార్లు, వైన్స్‌లలో అధిక మొత్తంలో వ్యాపారం జరిగినట్టు ఎక్సైజ్‌శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్సైజ్‌శాఖకు భారీగా ఆదాయం వచ్చినట్టు ఆయా జిల్లాల అధికారుల ద్వారా తెలిసింది. గతేడాది కంటే 2015లో అదనంగా 30 శాతం ఆదాయం పెరిగినట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liquior  New Year  celebrations  Telangana  Alchohol  

Other Articles