Crorepati Constable Of Madhya Pradesh Had 4 Cars, 6 Homes, 8 Bank Accounts

Lokayukta raid on crorepati consistable

Indore, head conistable, Corruption, crorepathi, Madhya Pradesh,Madhya Pradesh Police, Madhya Pradesh crorepati' consistable,Bribes,Graft,Head Constable,Police Corruption

Assets worth crores of rupees, including four cars and six homes, have been recovered in raids on a traffic police constable in Madhya Pradesh's Indore

ఎట్టకేలకు చిక్కిన కరుడు.. కాదు కాదు కరోడ్ పతి పోలీసు

Posted: 12/29/2015 01:19 PM IST
Lokayukta raid on crorepati consistable

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కరోడ్ పతి కానిస్టేబుల్ వెలుగుచూశాడు. ఇండోర్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అరుణ్ సింగ్ అవినీతి, అక్రమాలపై పలు ఫిర్యాదులు అందుకున్న మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు నిన్న రంగంలోకి దిగారు. ఇండోర్ తో పాటు రేవా, సత్నాలోని అతడి ఇళ్లపై ఏకకాకంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లోకాయుక్త అధికారులకు దిమ్మతిరిగే రీతిలో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి.

32 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న అతడికి ఇప్పటిదాకా వేతనం రూపేణా రూ.50 లక్షల మేర సర్కారీ సొమ్ము అంది ఉంటుంది. అయితే అతడి స్థిర, చరాస్తులను లెక్కలేసిన లోకాయుక్త అధికారులు అతడు కోటీశ్వరుడిగానే ఎదిగాడని తేల్చేశారు. సోదాల్లో భాగంగా ఇతగాడి పేరున, బంధువుల పేరున ఇండోర్ లో రెండు ఫ్లాట్లు, ఒక ఫామ్ హౌజ్, రెండు ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ ప్లాటు వున్నాయని తెలుసుకున్నారు.

దీంతో పాటు ఇండోర్ కు 700 కిలోమీటర్ల దూరంలోని రెవాలో, 25 ఏకరాలలో వున్న ఫామ్ హౌజ్, రెండు 8000 చదరపు అడుగుల ఖాళీ ప్లాటు, ఇవికాక నాలుగు విలాసవంతమైన కార్లు, రెండు కేజీల వెండితో పాటు కొంతమొత్తంలో బంగారు అభరణాలు, నగదు కూడా లభ్యమయ్యాయి. అంతేకాదండోయ్ ఇతగాడికి 8 బ్యాంక్ అకౌంట్లు కూడా వున్నాయని తేలిసింది. వీటన్నింటినీ లెక్కిస్తే సుమారుగా ఐదు కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ గా వుంటూనే ఇతగాడు కోట్లకు పడగలెత్తాడంటే.. ఇక లా అండ్ ఆర్డర్ లో వుండివుంటే ఎంత అర్జించేవాడో నన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indore  head conistable  Corruption  crorepathi  Madhya Pradesh  

Other Articles