Raigad man who killed wife in Dubai faces firing squad, woman's kin want custody of girl

Mumbai man sentenced to death by firing squad in dubai

UAE, Murder, Firing squad, custody, Bombay high court, Atif Qamruddin Popere, Atif Qamruddin Popere death sentence, Atif Qamruddin wife murder, Atif Qamruddin United Arab Emirates, Atif Qamruddin Raigad district, Atif Qamruddin Maharastra

A 26-year-old man from Raigad district, Atif Qamruddin Popere, who was earlier arrested in Dubai for killing his wife, now faces the firing squad in the United Arab Emirates following the confirmation of his death sentence by that country's highest court.

దుబాయ్ లో ముంబైవాసికి మరణశిక్ష.. తుపాకులతో కాల్చి చంపాలని అదేశం

Posted: 12/29/2015 01:18 PM IST
Mumbai man sentenced to death by firing squad in dubai

ప్రియుడే తన సర్వస్వం అనుకుని అతన్నే పెళ్లి చేసుకున్న ఓ ప్రియురాలిని.. విదేశాలకు తీసుకెళ్లి అక్కడ దారుణంగా హత్య చేసిన ఓ నయవంచకుడికి మరణం తన కళ్ల ఎదుట కనిపిస్తుంది. ఏ పోలీసు చేతిలోని తుపాకులను చూసినా.. అందులోని గుళ్లేనా తన ప్రాణాలు తీసేది అనేంతగా అతను జంకాల్సి వస్తుంది. భార్యను దారుణంగా హత్య చేసిన నేరానికి ముంబైకి చెందిన ఆతిఫ్ పొపీరే అనే యువకుడికి సౌదీ కోర్టు మరణశిక్ష విధించింది. అతన్ని తుపాకులతో కాల్చి చంపాలని ఆదేశించింది.

2013లో హత్య జరుగగా, తనకు క్షమాభిక్ష పెట్టాలని ఆతిఫ్ చేసుకున్న దరఖాస్తున్న దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం గతవారంలో తిరస్కరించింది. ఇక చావును తప్పించుకునేందుకు ఆతిఫ్ ముందు ఉన్న ఒకే ఒక్క దారి... బాధితుల కుటుంబీకుల నుంచి క్షమాభిక్ష. అయితే, ఆతిఫ్ భార్య బస్రా తల్లి ఉమా ధనుజయన్ మాత్రం, అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. క్షమాభిక్ష కావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ వచ్చినా తాను అంగీకరించబోనని వెల్లడించారు.

కాగా, ఉమ కుమార్తె మినీ ధనుంజయన్, ముంబైలోని మతుంగా కాలేజీలో చదువుతున్న సమయంలో ఆతిఫ్ పరిచయం అయ్యాడు. ఆపై వారు ప్రేమించుకుని, 2008లో పెళ్లి చేసుకోగా, మినీ తన పేరును బస్రాగా మార్చుకుంది. దుబాయ్ లోని ఓ షాపులో మేనేజర్ గా ఉద్యోగం రావడంతో ఆతిఫ్ తొలుత, ఆపై రెండేళ్లకు బస్రా దుబాయ్ వెళ్లింది. జీవితాంతమూ కలిసుంటాడని నమ్మిన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. "నా కుమార్తె మరణం తరువాత, అతను ఎలా శిక్షింపబడతాడో చూసేందుకు మాత్రమే నేను బతికున్నాను. అతనికి మరణమే సరైన శిక్ష" అని ఉమ ఆగ్రహంతో చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UAE  Murder  Firing squad  custody  Bombay high court  Atif Qamruddin  

Other Articles