Psycho died in police fire

Psycho died in police fire

Psycho, Karimnagar, Balvinder Singh, Psycho in Karimnagar

In Karimnagar dist, Balvinder singh attacked his parents and some others with Talwar. Police tried to arrest him, but he attacked them also. Police man open fire on hjim.

ITEMVIDEOS: కరీంనగర్ లో సైకో.. పోలీస్ కాల్పుల్లో మృతి

Posted: 12/22/2015 11:40 AM IST
Psycho died in police fire

కరీంనగర్ జిల్లాలో ఓ సైకో కలకలం సృష్టించారు. తన కుటుంబ సభ్యలు మీద దాడి చెయ్యడే కాకుండా రోడ్డున వెళుతున్న వారి మీద కూడా అతడు దాడికి పాల్పడ్డారు. అయితే పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద కూడా ఆ సైకో విరుచుకుపడటంతో.. పోలీసులు అతడి కుడి భుజం మీద కాల్పులు జరిపారు. అయితే ఆస్పత్రిలో చేరిన అతడు.. చికిత్స పొందుతూ మరణించారు. అదే ఆస్పత్రిలో అతడి చేత దాడికి గురైన 20 మంది చికిత్స పొందుతున్నారు. అయితే అందులో ఐదు గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సైకో 18 లక్షల జీతం అందుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

Also Read: సైనికుడిని రేప్ చేసిన మహిళలు..!

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ లక్ష్మీనగర్ కాలనీలో సైకో బల్వీందర్ సింగ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. దాదాపు 18 లక్షల రూపాయల జీతానికి అతడు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. అయితే రెండు రోజుల క్రితం కరీంనగర్ కు చేరుకున్న బల్వీందర్ సింగ్ వింతగా ప్రవర్తించారట. అలాగే కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన తల్వార్ తో కుటుంబ సభ్యుల మీద దాడి చెయ్యడమే కాకుండా వేరే వాళ్ల మీద కూడా దాడి చేశాడు. అయితే అతడి వివరాలు చెప్పడానికి మాత్రం అతడి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Psycho  Karimnagar  Balvinder Singh  Psycho in Karimnagar  

Other Articles