Cocks getting highest market rate on Sankranti eve

Cocks getting highest market rate on sankranti eve

Cocks, Sankranti, Chicken Fight, Godavari, east godavari, west godavari, Hen fight

Cocks getting highest market rate on Sankranti eve. Specially in Godavari districts, Cocks getting highest mrp in the market.

కోడికి టైం వచ్చింది.. లక్షలు పలుకుతున్న కోళ్లు

Posted: 12/22/2015 11:15 AM IST
Cocks getting highest market rate on sankranti eve

ప్రతి ఒక్కరికి ఓ టైం వస్తుంది.. ఆఖరుకు చెత్తకుప్పకు కూడా అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా కొక్కొరొకోలకు భలే డిమాండ్ వచ్చేసింది.. అదేనండీ కొక్కొరొకో అంటూ కోళ్లు. అవును కోళ్లకు భళే డిమాండ్ వచ్చింది.. దాంతో వాటి రేట్లు ఊహించనంతగా పెరిగిపోయాయి. ఇంతకీ కోళ్లకు ఎందుకు అంత క్రేజ్ అనుకుంటున్నారా..? సంక్రాంతి పండగ దగ్గర పడుతోంది కదా మరి.. పండగ అంటేనే కోడి పందేలు... మరి లక్షలు వేలు పెట్టి కాచే కోడి పందేల కోసం ఎలాంటి కోళ్లు కావాలి. అందుకే అదిరిపోయే కోళ్లు, జోరుమీదున్న కోళ్లకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఇంకా ఇరవై రోజులు ఉన్నా అప్పుడే కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది... కోడి పందేలకు, పేకాటకు తెర తీసింది అన్నట్లు గోదావరి జిల్లాల్లో విపరీతంగా కోళ్ల వ్యాపారం సాగుతోంది. పందెం కోళ్లను లక్షల్లో పెట్టి కొంటున్నారు గోదావరి వాసులు. రెండు వేల నుండి రెండు లక్షల వరకు పందెం కోళ్లు అదుబాటులో ఉన్నాయి. ఇక మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా కోళ్లను కూడా ఆన్ లైన్ మార్కెట్లో పెట్టి తమకు నచ్చిన రేట్ కు అమ్మతున్నారు. ఓఎల్ఎక్స్, క్వికర్ లాంటి సైట్ లలో కోళ్లకు గిరాకి పడుతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు కూడా ఓ భాగం. మరి చూడాలి కోడి పందేలు ఈ సారి ఏ రేంజ్ లో జరుగుతాయో..?



*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cocks  Sankranti  Chicken Fight  Godavari  east godavari  west godavari  Hen fight  

Other Articles