asian institute of gateoentrology managment harrassements patients dependents

Hospital refuses to give dead body of her husband

Human Rights Commission, HRC, Jyoti Prakash Dubey, moumitha jyothi Prakash Dubey, hyderabad asian hospital, Asian Institute of Gastroenterology Hospital, patient dependent approches hrc

asian institute of gateoentrology managment harrassements patients dependends without giving her husband dead body since four days

ఏసియన్ ఆసుపత్రిలో ఠాగూర్ సన్నివేశం.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు

Posted: 12/22/2015 11:15 AM IST
Hospital refuses to give dead body of her husband

చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఠాగూర్ లో ఆస్పత్రుల అలక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపాడు దర్శకుడు వినాయక్. అదే తరహాలో ఓ బాధితురాలికి తన భర్త శవాన్ని అప్పగించేందుకు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి అమానవీయ చర్యలకు పాల్పడింది. చికిత్స అందిస్తామని ఆ పనిని చేయలేకపోయిన అసుపత్రి .వైద్యులు.. వైద్య ఖర్చులు చెల్లించలేదనే సాకుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని అప్పగించకుండా గత నాలుగు రోజుల నుంచి ఆస్పత్రి అధీనంలోనే పెట్టుకున్న వైనం ఇది. బాధితుని భార్య రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం చివరకు ఆమె భర్త మృత దేహాన్ని అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే..  పశ్చిమబెంగాల్‌కు చెందిన జ్యోతిప్రకాష్ దూబే ప్రాంక్రియాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ..నవంబర్ 11న ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ప్రాంకీయాస్ పూర్తిగా పాడైనట్లు గుర్తించిన వైద్యులు బాధితునికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నెల రోజులుగా  ఆస్పత్రిలోనే ఉన్న దూబే డిసెంబర్ 18న రాత్రి చనిపోయారు. ఆస్పత్రిలో మార్చురీ లేక పోవడంతో అదే రోజు రాత్రి శవాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కాగా ఇప్పటి వరకు అతని చికిత్స కోసం ఆస్పత్రి వైద్య ఖర్చులు రూ.7.50 లక్షల బిల్లు కాగా, అందులో రూ.5 లక్షలు చెల్లించినట్లు, మిగిలిన మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన భర్త శవాన్ని అప్పగించాలని  మృతుని భార్య మౌమిత దూబే ఆస్పత్రి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

అయినా ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపలేదు. బిల్లు మొత్తం చెల్లిస్తేనే భర్త శవాన్ని, పోస్టుమార్టం రిపోర్టును అప్పగిస్తామని స్పష్టం చేసింది. నాలుగు రోజులుగా అర్థిస్తున్నా యాజమాన్యం కనుకరించకపోవడంతో.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే శవాన్ని ఆమెకు అప్పగించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles