YSRCP MLA Roja arrested at assembly premises

Ysrcp mla roja arrested at assembly premises

Roja, Jagan, Call Money, Chandrababu, AP, Assembly, Assembly Winter sessions

YSRCP MLA Roja arrested at assembly premises. AP Assembly speaker suspened Roja for year yesterday. Today she came to asembly premises then security stoped her.

అసెంబ్లీ వద్ద రోజా హల్ చల్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

Posted: 12/19/2015 10:32 AM IST
Ysrcp mla roja arrested at assembly premises

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఏపి అసెంబ్లీ వద్ద హల్ చల్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా స్పీకర్ ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఈ ఉదయం ఎమ్మెల్యే రోజా.. వైసీపీ మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. అయితే అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. రోజా అక్కడికి రావడానికి వీలులేదని భద్రతా సిబ్బంది అడ్డుతగలడంతో వైసీనపీ నాయకులకు, భద్రతా సిబ్బందికి తోపులాట జరిగింది. అయితే రంగంలోకి ప్రవేశించిన పోలీసులు కొంత మంది వైసీపీ నాయకులను, రోజాను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే ఏపి అసెంబ్లీ సమావేశాల మూడో రోజు కూడా అదే మాదిరిగా సాగింది. కాల్ మనీ మీద చర్చకు, నిన్న వైసీపీ ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ ను నిరసిస్తు వైసీపీ ఆందోళన చేపట్టింది. అయితే అసెంబ్లీ ఆవరణలో అరెస్టు చేసిన రోజాను ముందు సైఫాబాద్ పిఎస్ కు ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే తమ ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నాంపల్లి పిఎస్ కు బయలుదేరారు. మరో పక్క రాష్ట్ర అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు కూడా అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు. కాగా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YS Jagan  Call Money  Chandrababu  AP  Assembly  Assembly  

Other Articles