ruling and opposition parties over call money and sex racket

Call money and sex racket dominate ap assembly

Call money, TDP, YSRCP, congress, JaganMohanreddy, Jagn, Raghuveera Reddy, Chiranjeevi, call money scandal, Assembly, Andhra pradesh intelligence failed once again, AP intelligence failed again, chandrababu, andhrapradesh, Intelligence, intelligence dg venkateshwara rao, ab venkateshwara rao ips, call money scam

call money and sex racket scandal dominate ap assembly, as ruling and opposition parties alleges each other on the issue

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో.. అధికార, విపక్షాల మధ్య ‘కాల్’ పోతుంది..

Posted: 12/18/2015 07:55 PM IST
Call money and sex racket dominate ap assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా రాజధానిలో రైతులు భూములన లాక్కుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో వైసీపీ సభ్యులను చాకచక్యంగా బొల్తా కోట్టించిన టీడీపీ అధినేత.. ఇప్పుడు కాల్ మనీ వ్యవహారంలో కూడా అదే పంథాను ఎంచుకున్నారా..? అంటే అవుననే సమాధానమే వినబడుతుంది. వైసీపీ నేతలను మరోమారు బొల్తా కొట్టించడానికే టీడీపీ యత్నిస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి.

సరిగ్గా ఆ అసెంబ్లీ సమావేశాలను పరిశీలించిన వ్యక్తులకు చంద్రబాబు హావబావాలు, రౌద్రం, అవేశం, శాంతం అన్ని అచ్చుగుద్దినట్టుగా అప్పట్లానే కనబడుతున్నాయి. ప్రతిపక్ష్యాన్ని వ్యూహాత్మకంగా కట్టడి చేయడంలో ఆయన ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేశారు. తమను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, సభలో దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎంకే రక్షణ లేకుంటే ఎవరికి రక్షణ ఉంటుందని బాబు ప్రశ్నించారు.

వైసీపీ సభ్యులు సీఎం కుర్చీ వైపు ఎందుకొస్తున్నారని, మీకు అభ్యంతరం ఉంటే మీ స్థానాల్లో నిల్చుని ప్రశ్నించాలని ఆయన సూచించారు. గత సమావేశాల్లోనూ ఇలాగే ప్రవర్తించారని, వైసీపీ సభ్యులు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రౌడీయిజం చేయాలని చూస్తున్నారా అంటూ బాబు ప్రశ్నించారు. వైసీపీ సభ్యులకు సభ అంటే గౌరవం లేదని బాబు చెప్పారు.
 
ఇదిలా ఉంటే వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ కోడెల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు వచ్చే ముందు సభా సాంప్రదాయాలు తెలుసుకుని రావాలని సూచించారు. ‘మీకు తెలియదు.. చెప్పేవాళ్లు లేరు.. చెప్పినా వినరు’ అంటూ స్పీకర్ వైసీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు రావడం సరైన పద్ధతి కాదని, కూర్చోవాలని కోడెల సూచించారు. ప్రతిపక్ష నాయకుడి కంటే సభా నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పీకర్ చెప్పారు. సభా నాయకుడి ప్రకటనపై ఏవైనా అభ్యంతరాలుంటే ప్రస్తావించొచ్చని కోడెల సూచించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కౌరవ సభను తలపిస్తున్నాయని ప్రతిపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులో ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నారని, అటువంటి వ్యక్తి ప్రకటన చేస్తే మేం ఎందుకు ఒప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. కాల్ మనీలో ముద్దాయి ముఖ్యమంత్రితో పాటే అసెంబ్లీకి వస్తారని, కానీ అతడిని పోలీసులు అరెస్ట్ చేయరని జగన్ వ్యాఖ్యానించారు. అది కాల్ మనీ కేసు కాదని సెక్స్ రాకెట్ కేసు అని జగన్ చెప్పారు. ఇంత దారుణ పరిస్థితులు ఏపీ అసెంబ్లీలో తప్ప ఎక్కడా లేవని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhrapradesh  Intelligence  Call money  

Other Articles