Achennaidu repeats Rojas yesterdays contraversial statements

Achennaidu repeats rojas yesterdays contraversial statements

AP, Assembly, Chandrababau, Roja, yanamala Ramakrishnudu, Achennaidu, Speaker, call money

Achennaidu repeats Rojas yesterdays contraversial statements. Roja said some cinema dialouges in the ap assembly, then speaker suspened her for one year.

బుల్లెట్ దిగిందా లేదా అని అసెంబ్లీలో అనొచ్చా..?

Posted: 12/19/2015 10:51 AM IST
Achennaidu repeats rojas yesterdays contraversial statements

ఏపి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గత రెండు రోజులు కూడా గందరగోళం మధ్యన జరిగిన సమావేశాలు మూడో రోజు కూడా నిరసనలు... నినాదాల మధ్యన జరుగుతున్నాయి. అయితే సబలో నిన్నటి సమావేశం మీద చర్చ సాగింది. నిన్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న క్రమంలో వైసీపీ నాయకులు చేసిన గందరగోళాన్ని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. సభలో సంప్రదాయాలను ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏడాది పాటు ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం మీద జగన్ మండిపడ్డారు. ఎక్కడా ఇలాంటి దారుణాలు జరగలేదని అన్నారు. అయితే దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

Also Read: అసెంబ్లీ వద్ద రోజా హల్ చల్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

నిన్నటి సభలో రోజా చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తుకు చేశారు. కొత్తగా వచ్చిన వారు.. తెలియని వాళ్లు సభ సంప్రదాయాలను తెలుసుకోవాలని, టిడిపి ఎమ్మెల్యేలు సూచించారు. అయితే దీని మీద వైసీపీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అంతే కానీ మిగతా ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు దీని మీద మండిపడ్డారు. రోజా ఇలా అనొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైయస్ సిఎంగా ఉన్నప్పుడు ఇలాగే ఓ ఎమ్మెల్యే మాట్లాడితే ఆరు నెలల పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేకపోతే.. రోజాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Assembly  Chandrababau  Roja  yanamala Ramakrishnudu  Achennaidu  Speaker  call money  

Other Articles