Call Money in vijayawada

Call money in vijayawada

Money, call Money, Vijayawada, Budda Venkanna, Bode Prasad, Chandrababu Naidu, call money in ap, call money harrasment

The full story of call money in Vijayawada. The call money gang harrasing people for money.

ITEMVIDEOS: కాల్ మనీ కథ ఇది.. ఆడవాళ్లతో ఆటలు

Posted: 12/14/2015 12:18 PM IST
Call money in vijayawada

మోసపోయేబడే వాడు ఉన్నంత కాలం మోస చేసే వాడు చేస్తూనే ఉంటాడు అని తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. తాజాగా కాల్ మనీ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.  వేల కోట్ల రూపాయలు పోగేసిన కాల్ మనీ నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఇందలో ఉన్నట్లు వస్తున్న ఆరోపణలతో చంద్రబాబు నాయుడు సర్కార్ కు కొత్త తలనొప్పి మొదలైంది.

Also Read: కాల్ మనీ వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే..?

కాల్ మనీతో పాటు.. నిందితులు కాల్ మనీ ముసుగులో ఆస్తుల తనకా, అమ్మాయిలను మోసగించడం వంటి తదితర మూడు వ్యాపారాలు కూడా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించకుంటే ఆస్తులను రాయించుకోవడం, మహిళలు అయితే వారిని వ్యభిచార వృత్తిలోకి దింపే ప్రయత్నం చేయడం జరుగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్ మనీ నిందితుల పైన నిర్భయ కేసు కూడా నమోదయింది. అయితే ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో తమ పేర్లు ఎక్కడ బయటపెడతారోనని పలువురు నేతలు అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. కాల్ మనీ కేసులో ఒత్తిళ్లు వస్తున్నాయా? కాల్ మనీ బాధితులు హైకోర్టులో పిల్ వేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, కాల్ మనీ కేసు విచారణలో ముందుకు వెళ్లవద్దని పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. టాస్క్ ఫోర్స్ వద్దకు బాధితులు వరుస కట్టారు. మరోవైపు కాల్ మనీ విషయమై చంద్రబాబు సీరియస్‌గా స్పందిస్తున్నారు.

వందల కోట్లలో కాల్ మనీ దందా నడుపుతున్న బడాబాబులు డబ్బు వసూలు కోసం మహిళలను వేధిస్తున్నారు. వీరి బారిన వందలాది మంది పడ్డారు. డబ్బు చెల్లించలేని పక్షంలో ఆ కుటుంబానికి చెందిన మహిళలను లైంగికంగా వాడుకోవడం ఈ బ్యాచ్ స్టైల్. అంతేకాకుండా తమ దందాకు అండగా ఉండే అధికారులు, నాయకుల వద్దకు ఆ మహిళలను బలవంతంగా పంపుతున్నట్టు వెలుగుచూసింది. వీరి బారిన కొందరు విద్యార్థినులు కూడా పడ్డారని సమాచారం. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి విజయవాడ సీపీని ఆశ్రయించడంతో డొంకంగా కదిలింది. ఈ దందాకు సంబంధించి మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఎలక్ట్రికల్ ఉద్యోగి ఒకరు ఒక యువతిపై ఇదే తరహాలో అత్యాచారం చేశాడని వార్తలు వస్తున్నాయి. విజయవాడకు పక్కనే ఉండే నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కాల్ మనీకి అండగా ఉన్నారని ఒక పత్రిక రాసింది. ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం కాల్ మనీ డబ్బుతోనే విదేశాల్లో విహరిస్తున్నారని కూడా ఆ పత్రిక ప్రచురించింది. ఫారిన్ టూర్-లో ఆ ఎమ్మెల్యే వెంట కాల్ మనీ సూత్రధారి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్ మనీ బ్యాచ్ ఒక సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేను గతంలో సన్మానించడం కూడా చర్చనీయాంశమైంది. కాల్ మనీ దందాలో అరెస్ట్‌ అయిన యలమంచిలి శ్రీరామ్ టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటున్నారని చెబుతున్నారు.

ఇక కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం నేత బోడె ప్రసాద్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తాను తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి ఫోటోలు దిగి, సామాజిక మాధ్యమాల్లో పెడితే, తమవారి ముఖాలను మార్ఫింగ్ చేసి అమ్మాయిలతో జల్సాలు చేస్తున్నానని ప్రచారం చేశారని ఆరోపించారు. కాల్ మనీలో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో సీబీఐ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. తనపై ఉన్న ఒక్క ఆరోపణ రుజువైనా పదవికి రాజీనామా చేస్తానని, ఎటువంటి శిక్షకైనా సిద్ధమని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం కూడా తప్పేనా? అని ప్రశ్నించిన ఆయన, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే తన పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వెనిగళ్ల శ్రీకాంత్ తనకు మిత్రుడు మాత్రమేనని మరోసారి చెప్పిన ఆయన, తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని అన్నారు.

కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలకు, తెలుగుదేశం పార్టీకీ ఎలాంటి సంబంధం లేదంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. తన సోదరుడికి కాల్‌మనీ మాఫియాతో లింకులున్నాయన్న విషయం బయటపడేసరికి బుద్దా వెంకన్న అలర్ట్‌ అయ్యారు. మీడియా సాక్షిగా తన సోదరుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు మాత్రమే తనకు తెలుసునని… గత కొన్నాళ్లుగా తన అన్నయ్యతో సన్నిహిత సంబంధాలు లేవని ఆయన తప్పు చేసినట్లు రుజువైతే అతని అరెస్టుకు తాను అడ్డపడనని కూడా ప్రకటించారు. అయినా గుమ్మడి కాయల దొంగల్లాగ భుజాలు తడుముకుంటే తప్పు తప్పుకాకుండా పోతుందా..? అయినా పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలాంటి వత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేస్తారా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles