intolerance if i does not sleep half an hour in the afternoon minister kadiyam srihari says

Telangana deputy chief minister kadiyam srihari on intolerence

kadiyam srihari, Intolerance, sleep in the afternoon, kadiyam srihari on Intolerance, telangana deputy chief minister on Intolerance, minister kadiyam on Intolerance,

telangana deputy chief minister kadiyam srihari on intolerence, says if i does not sleep half an hour in the afternoon after lunch he gets intolerent

కడియం నోట అసహనం మాట..

Posted: 12/14/2015 12:30 PM IST
Telangana deputy chief minister kadiyam srihari on intolerence

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి అసహనంపై వ్యాఖ్యలు చేశారు. తాను అప్పడప్పుడూ అసహనానికి గురవుతానని చెప్పారు. అదేంటి ఆయన అసహనానికి ఎలా గురవుతున్నారనే గా మీ సందేహం.. నిజమేనండి.. ఉపముఖ్యమంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా క్షణం తీరిక లేకుండా పనిచేసే కడియం.. అప్పుడప్పుడూ తనను అసహనం ఆవహిస్తుందని చెప్పారు. వరంగల్ లోని ఓ హోటల్ లో  స్లీప్ అప్ డేట్స్ (స్లీప్ సెన్సెన్)పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

'మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అర్ధగంట సేపు నిద్రపోకపోతే తీవ్ర అసహనానికి గురవుతా. చక్కగా ఓ అర్ధగంట నిద్రపోతే, రిఫ్రెష్ అయి, మళ్లీ రాత్రి వరకు చురుకుగా పనిచేయగలుగుతా' అని చెప్పుకొచ్చారు. వర్తమాన జీవన విధానం ఎంతటి గందరగోళంగా ఉందో తనదైన శైలిలో వివరిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏది ఏమైనా రాత్రి 10.30 దాటుతుందంటే కంటి మీద కునుకు ఆగదని, పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతానని, ఉదయం 7 గంటలకుగానీ మెలకువ రాదని వివరించారు కడియం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Intolerance  sleep in the afternoon  kadiyam srihari  

Other Articles