Hour-long Tornado in East Godavari Creates Havoc

Twister in east godavari creates havoc

Hurrikane, sunkara palem, tornado, twister, hurricane, tornado in taallarevu, tornado in East Godavari, tornado in AndhraPradesh, twister in taallarevu, twister in East Godavari, twister in AndhraPradesh

An hour-long tornado emerged on the ground at Shankarapalem in Taallarevu mandal of East Godavari on Sunday created havoc among villagers.

ఆంధ్రప్రదేశ్ లో అమెరికా తరహా ప్రకృతి విపత్తులా..?

Posted: 12/14/2015 10:01 AM IST
Twister in east godavari creates havoc

అమెరికా తరహా ప్రకృతి విపత్తులకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారనునందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లావాసులను భయపట్టిన సుడిగాలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. చిన్నసైజు టోర్నడోలా వచ్చిన చెలరేగిన సుడిగాలి వణికించింది. సుంకరపాలెం బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం సుడిగాలి ఏర్పడి గంటపాటు హడావిడి చేసేంది. సరిగ్గా అమెరికాలోని టోర్నడోలా రోడ్డుపై దుమ్ముంతా సుడులు తిరుగుతూ పైకి లేవడంతో అలా చాలా ఎత్తు వరకు చేరడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దాదాపు గంట పాటు సుడిగాలి అక్కడ చక్కెరలు కొట్టడంతో స్ధానికులు తమ సెల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రికరించారు. మరి కొందరు భయంతో దూరంగా పరుగులు తీశారు. ఇంకోందరు సుడిగాలని ఆసక్తిగా గమనించారు. ఆకస్మాత్తుగా సుడిగాలి రేగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు కారణంగానే సుడిగాలి రేగివుండొచ్చని అంటున్నారు. కాగా అభివృద్ది చెందిన దేశాలు అనునిత్యం విరివిగా కాలుష్యాన్ని వెదజల్లడంతో.. ప్రకృతిలో మార్పులు సంభవిస్తున్నాయని.. దాంతోనే గ్లోబల్ వార్మింగ్ సహా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిఫుణులు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hurrikane  sunkara palem  tornado  twister  East Godavari  AndhraPradesh  

Other Articles