Ex-Oklahoma City cop's rape conviction symbol of national problem

Oklahoma city cop daniel holtzclaw found guilty of rapes

Oklahoma ex-cop Daniel Holtzclaw, Daniel Holtzclaw weeps, Daniel Holtzclaw convicted, Daniel Holtzclaw raped 13 black women on duty, rapist police officer, Oklahoma, ex-cop, Daniel Holtzclaw, convited, 263 years imprisonment

An Oklahoma City jury convicted a former police officer of sexually assaulting several women while on duty.

ఆమెరికా రేపిస్ట్ పోలీసుకు 263 ఏళ్ల జైలు శిక్ష

Posted: 12/11/2015 07:56 PM IST
Oklahoma city cop daniel holtzclaw found guilty of rapes

అమెరికాలో వర్ణవివక్షతో నల్లజాతీయులైన మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఓ తెల్లజాతీ పోలీసు అధికారికి న్యాయస్థానంలో సుదీర్ఘ శిక్ష పడింది. పోలీసు అధికారిగా వుంటూ నేరాలను అదుపు చేసి, దేశసౌరుల శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వుండగా, నల్లజాతీయులైన మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డాడు. దీంతో అతనిపై నమోదైన కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇవాళ ఆయనకు శిక్షను ఖరారు చేసింది.

డేనియల్ అనే 29 ఏళ్ల మాజీ పోలీస్ ఆఫీసర్‌పై అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో న్యాయస్థానం 263 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. డేనియల్‌పై 36 అత్యాచార ఆరోపణలుండగా 18 నిర్ధారణ అయ్యాయి. డ్యూటీలో ఉండగా మొత్తం 13 మంది నల్లజాతి మహిళలను ఇతడు లైంగికంగా వేధించాడు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల చిన్నారి, ఓ బామ్మ కూడా డేనియల్ బాధితులే. నిజానికి తీర్పు వెలువడిన రోజు డేనియల్ బర్త్‌డే కూడా. దీంతో డేనియల్‌కు శిక్ష పడగానే అతడి బాధితులంతా హ్యపీ బర్త్‌డే పాట పాడారు. కాగా ఆ కామాంధుడు మాత్రం విలపించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oklahoma  ex-cop  Daniel Holtzclaw  convited  263 years imprisonment  

Other Articles